Viral Video: జాకీచాన్‌లా ఫోజ్ ఇచ్చాడు.. ఒకటి ఊహిస్తే మరొకటి జరిగింది.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూడటానికి ఆశ్చర్యకరంగా ఉంటే.. మరికొన్ని వీడియోలు
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూడటానికి ఆశ్చర్యకరంగా ఉంటే.. మరికొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరంతే. పాత కట్టడాలను చాలామంది తేలికగా తీసుకుంటారు. అయితే, అవి ప్రమాదకరం అని గుర్తించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఓ వ్యక్తి. బాహుబలి మాదిరిగా ఓ గోడను కూలగొట్టపోయి.. లేని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. సంబంధిత వీడియో చూస్తే పాపం అనిపిస్తుంటుంది. అదే సమయంలో నవ్వు తెప్పిస్తోంది.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి సంబంధించి పాత గోడను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా అతను మొదట గోడను నెట్టాడు. మొదటి ప్రయత్నంలో సక్సెస్ కాకపోవడంతో.. మళ్లీ రెండోసారి ప్రయత్నించాడు. ఈసారి కొంచెం గట్టిగా గోడను నెట్టాడు. దాంతో ఆ గోడ కూలిపోతోంది. అయితే, ఊహించని రీతో అతని వెనుకపైపు ఉన్న కూడా కూలిపోయి.. అతనిపైనే పడిపోయింది. వెనుకవైపు ఉన్న గోడ కూలడాన్ని గమనించకపోవడంతో అతను స్వల్పంగా గాయపడ్డాడు. ముందు గోడ కూలగొట్టాననే సంతోషంలో.. తనకు తాను జాకీచాన్‌లా ఫోజ్ పెట్టాడు. కానీ, వెనుక ఉన్న గోడ కూలి అతని మీద పడటంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తరువాత వెంటనే తేరుకుని శిథిలాల్లో చిక్కుకున్న తన కాలు ని బయటకు లాక్కున్నాడు. కుంటుతూ బయటకు వచ్చాడు. ఈ ఊహించని పరిణామంతో అతను మైండ్ బ్లాంక్ అయ్యింది. అయితే, గోడ కూల్చే సమయంలో అతను హెల్మెట్ ధరించడం సేఫ్ అయ్యింది. లేదంటే మరింత ప్రమాదం జరిగి ఉండేది.
ఈ ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు నవ్వుకుంటున్నారు. ఈ వీడియోకు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అతని హెల్మెట్ అతన్ని కాపాడిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇడియట్స్ ఫైటింగ్ థింగ్స్ అనే పేజీలో షేర్ చేయగా.. ఇప్పటి వరకు 14 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
Also read:
Crime News: తల్లిని బెదిరించి ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి..
Immunity booster : పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఆహారాన్ని తినిపించండి..
Viral Video: హలో బ్రదర్ ఇదేం డ్యాన్స్.. ఇలా కూడా చేస్తారా?.. వీడియో చూడండి.. కడుపుబ్బా నవ్వుకోండి..