AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హలో బ్రదర్ ఇదేం డ్యాన్స్.. ఇలా కూడా చేస్తారా?.. వీడియో చూడండి.. కడుపుబ్బా నవ్వుకోండి..

Viral Video: పెళ్లంటే సందడి. సందడి లేకపోతే ఆ పెళ్లికి అర్థమ లేదు. ఇక పెళ్లిలో అసలైన సన్నివేశం బారత్. ఈ బారత్‌లో డీజే, బ్యాండ్‌ బాజా మోగుతుంటే..

Viral Video: హలో బ్రదర్ ఇదేం డ్యాన్స్.. ఇలా కూడా చేస్తారా?.. వీడియో చూడండి.. కడుపుబ్బా నవ్వుకోండి..
Dance
Shiva Prajapati
|

Updated on: Aug 11, 2021 | 5:11 AM

Share

Viral Video: పెళ్లంటే సందడి. సందడి లేకపోతే ఆ పెళ్లికి అర్థమ లేదు. ఇక పెళ్లిలో అసలైన సన్నివేశం బారత్. ఈ బారత్‌లో డీజే, బ్యాండ్‌ బాజా మోగుతుంటే.. వధువరుల కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బంధులు రచ్చ రచ్చ గా డ్యాన్స్ చేస్తుంటారు. ఈ డ్యాన్స్‌కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఓ వ్యక్తి నాగిని పాటకు భీకరమైన డ్యాన్స్ చేశాడు. మొత్తం ఆ పాటలో లీనమైపోయి ఊగిపోయాడు. అతని డ్యాన్స్ చూస్తే షాక్ అవుతారు. అదే సమయంలో కడుపుబ్బా నవ్వుకుంటారు.

ఈ వీడియోలో పెళ్లి బారత్ తీస్తున్నారు. ఆ సందర్భంగా వేసిన నాగిని పాటకు అక్కడి వారంతా రకరకాలుగా డ్యాన్స్ చేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఊహించని రీతిలో డ్యాన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ పాటలో పూర్తిగా లీనమైపోయి.. తానే నాగరాజుగా మారినట్లు ఫీల్ అవుతూ డ్యాన్స్ కుమ్మేశాడు. శరీరం అంతా నాగిని మాదిరి షేక్ చేస్తూ రచ్చ చేశాడు. అయితే, ఏదో తేడా కొట్టడంతో పక్కనే ఉన్న అతని స్నేహితుడు ఒకరు.. అతన్ని అవతలివైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ, అతను మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. అది చూసి స్థానికులు నవ్వుకున్నారు.

ఈ ఫన్నీ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో official_niranjanm87 అనే పేరుతో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను ఒక రేంజ్‌లో షేర్ చేస్తున్నారు. దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి వేడుకలో ఇలాంటి నాగిని డ్యాన్స్ చూడటం ఇదే మొదటిసారి అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. అమ్మ బాబోయ్ ఇదేం డ్యాన్స్ అంటూ మరొకరు కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఈ వీడియోను మీరూ చూసేయండి మరి.

Viral Video:

Also read:

Hyderabad: సినీ ఫక్కీలో చోరీ.. ఉలిక్కిపడిన పాతబస్తీ.. బైక్‌లపై చేజ్ చేసి మరీ అందినకాడికి దోచుకెళ్లారు..

Seethakka: ప్రభుత్వం అందుకే దళిత బంధు తెచ్చింది.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

Ashok Gajapathi Raju: జగన్ ప్రభుత్వ ఎంక్వైరీలన్నీ అందుకోసమే : మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు