AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seethakka: ప్రభుత్వం అందుకే దళిత బంధు తెచ్చింది.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

హుజురాబాద్ ఎన్నికలతో దళిత బందు వచ్చింది.. నిన్న ఇంద్రవెల్లి సభతో ఇప్పుడు పోడు భూములు గుర్తుకొచ్చాయి అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నాయకులకి ఎన్నికలు

Seethakka: ప్రభుత్వం అందుకే దళిత బంధు తెచ్చింది.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు
Seethakka
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 10, 2021 | 10:22 PM

Mulugu MLA Seethakka:హుజురాబాద్ ఎన్నికలతో దళిత బందు వచ్చింది.. నిన్న ఇంద్రవెల్లి సభతో ఇప్పుడు పోడు భూములు గుర్తుకొచ్చాయి అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నాయకులకి ఎన్నికలు జరిగితేనే ప్రజలు గుర్తుకొస్తారని ఆమె విమర్శించారు. “పోడు భూములపై గిరిజనులకు హక్కు కల్పించింది సోనియాగాంధీ.. ఈ రాష్ట్రలో ఎదిరించే స్వేచ్ఛ లేదు.. రాబోయే రోజుల్లో మరిన్ని సభలతో గర్జిస్తామని ఆమె తెలిపారు.

సభని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పిన సీతక్క.. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ విషయంలో క్షమాపణ చెప్పండని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. గడిచిన ఏడేళ్లుగా పోడు రైతులు పట్టాల కోసం పోరాటాలు చేస్తున్నారని ఆమె గుర్తుచేశారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వడంతో పాటు రైతు బంధు వర్తింపజేయాలని సీతక్క డిమాండ్ చేశారు. జనాలు రేవంత్ రెడ్డిని మరిచిపోలేదని, ఫాం హౌస్లో ఉన్న కేసీఆర్ ను మరిచిపోయారని కామెంట్ చేశారు సీతక్క.

ఇంద్రవెల్లి సభకు వచ్చే వారిని కొందరు పోలీసులు వ్యక్తిగత ఎజెండాతో అడ్డుకున్నారని, అయినా సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తదితర కాంగ్రెస్ నాయకులతో కలిసి సీతక్క మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

Read also: “మా తెలుగు తల్లికి మల్లెపూదండ”కి అందిన పారితోషికం, ఈ పాట ఎప్పుడు.. ఎందుకు.. ఎవరు రాశారో, ఎలా పుట్టిందో తెలుసా.?