Body in Burnt Car: ఫ్యామిలీతో తిరుపతికి వెళ్లాల్సిన వ్యక్తి కాలిబూడిదయ్యాడు.. కారులో క్రైమ్‌ కథ.. కీలకంగా మారిన కట్టుడు పళ్లు!

సంచలనం రేపిన డిక్కీలో శవం కేసులో నిజాలు వెలుగు చూస్తున్నాయి. సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ను బట్టి హత్యేనని తేలినా.. హతుడు ఎవరో తేల్చడం.. ఖాకీలకు సవాల్‌గా మారింది. చిక్కుముడి వీడే కొద్దీ సెన్సేషనల్‌ ఎలిమెంట్స్‌..

Body in Burnt Car: ఫ్యామిలీతో తిరుపతికి వెళ్లాల్సిన వ్యక్తి కాలిబూడిదయ్యాడు.. కారులో క్రైమ్‌ కథ.. కీలకంగా మారిన కట్టుడు పళ్లు!
Dead Body Found In Burnt Car In Medak
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 10, 2021 | 9:57 PM

Dead Body in Burnt Car at Medak: మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో హత్యకు గురైన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. సంచలనం రేపిన డిక్కీలో శవం కేసులో నిజాలు వెలుగు చూస్తున్నాయి. సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ను బట్టి హత్యేనని తేలినా.. హతుడు ఎవరో తేల్చడం.. ఖాకీలకు సవాల్‌గా మారింది. ఒక్కో చిక్కుముడి వీడుతున్న కొద్దీ సెన్సేషనల్‌ ఎలిమెంట్స్‌ తెరపైకి వచ్చాయి. థియేటర్‌ ఓనర్‌, రియల్టర్‌ ధర్మకారి శ్రీనివాస్‌ది ప్రీ-ప్లాన్డ్‌ మర్డర్‌ అనే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే, ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. కానీ, ఈ ప్రాసెస్‌లో మొదటి నుంచి కొనసాగిన సస్పెన్స్‌ మాత్రం మాములుగా లేదు.

మెదక్ జిల్లా అటవీ ప్రాంతానికి సమీపంలో రోడ్డు పక్కన దుండగులు కారును దగ్ధం చేశారు. కారు డిక్కీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌ కుమార్‌ ఆధర్యంలో పోలీసలుు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో చనిపోయిన వ్యక్తి వివరాలు తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. హత్య చేసి..డెడ్‌బాడీని డిక్కీలో పడేసి నిప్పంటించారని ప్రాథమిక దర్యాప్తులో నిర్దారణకు వచ్చారు పోలీసులు. రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ఆధారంగా కారు మెదక్‌లోని చక్రధర్‌ థియేటర్‌ ఓనర్‌ ధర్మకారి శ్రీనివాస్‌దని తేలింది. మరి డిక్కీలో బుగ్గిపాలైన ఆ వ్యక్తి ఎవరు? డిక్కీలో డెడ్‌బాడీ ఎవరిదన్నది మిస్టరీగా మారింది.

మృతుడి శ్రీనివాసే అయివుంటాడని ఓ అంచానాకు వచ్చారు పోలీసులు. మృతుడు మెదక్‌కు చెందిన శ్రీనివాస్‌గా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో. మృతుడి నోటిలో ఉన్న కృత్రిమ దంతాల ఆధారంగా శ్రీనివాస్‌ను ఆయన భార్య హైందవి గుర్తించారు. సోమవారం ఉదయం మెదక్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు శ్రీనివాస్‌. మధ్యాహ్నాం నుంచి ఆయన ఫోన్‌ స్విచ్చాఫ్‌లో వుంది. అనంతరం చావు కబురు వినాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. కారులో ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ప్రయాణించారని కూడా తేలింది. వివాహేతర సంబంధం కోణం తెరపైకి వచ్చింది. భర్త హత్యపై ఆమె వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, శ్రీనివాస్‌ తనతో తరచూ గొడవ పడేవాడని హైందవి పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్లూస్‌ టీమ్స్‌ రంగంలోకి దిగాయి. కీలక ఆధారాలను సేకరించిన ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌కుపంపారు. కుటుంబసభ్యులు స్పాట్‌కు చేరుకున్నారు. కట్టుడు పన్ను..ఈ కేసులో కీలకంగా మారింది. శ్రీనివాస్‌..వెల్దుర్ధికి ఎందుకుకెళ్లారు? ఎవరు పిలిస్తే? హానీ ట్రాప్‌ను తలదన్నే ఈ క్రైమ్‌ కథా చిత్రమ్‌లో ఇంకెన్ని షాకింగ్‌ ఎలిమెంట్స్‌ తెరపైకి రానున్నాయో అనే చర్చ జరుగుతో

నేరస్తులు ఎంతటి వాళ్లయినా సరే.. సినీ ఫక్కీలో కేసును పక్కదోవ పట్టించాల్సిన చూసినా సరే..ఏదో ఒక చిన్న క్లూతో చట్టానికి చిక్కక తప్పదు.ఈ బేసిక్‌ లైనే మంగళపర్తి మర్డర్‌ మిస్టరీలో పురోగతికి దారి చూపింది. స్పాట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ట్రేసవుట్‌ చేశారు.

Read Also…  YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్యకేసులో కీలక మలుపు.. ఎంపీ అవినాష్‌రెడ్డి సిబ్బందిని విచారించిన సీబీఐ