AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: తల్లిని బెదిరించి ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి..

Crime News: హర్యానా రాష్ట్రం సోనిపట్ పరిధిలోని ఓ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిని బెదిరించి.. ఇద్దరు మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

Crime News: తల్లిని బెదిరించి ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి..
Shiva Prajapati
|

Updated on: Aug 11, 2021 | 5:23 AM

Share

Crime News: హర్యానా రాష్ట్రం సోనిపట్ పరిధిలోని ఓ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిని బెదిరించి.. ఇద్దరు మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆ బాలికలచే పురుగుల మందు తాగించి బలవన్మరణానికి ప్రోత్సహించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి కుండ్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ రవి కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులు నలుగురు 22 నుంచి 25 సంవత్సరాల వయస్సు గలవారు. వలస కార్మికులు. బాలికలు ఇంటి పక్కన ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. ఇక మైనర్ బాలికలు ఇద్దరూ తల్లితో కలిసి కూలి పని చేసుకునేవారు. ఈ క్రమంలో ఆగస్టు 5, 6 తేదీన మధ్య రాత్రి.. నిందితులు నలుగురు బలవంతంగా బాలికల ఇంట్లోకి ప్రవేశించారు. వారి తల్లిని బెదిరించి.. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత వారిచే పురుగుల మందు తాగించారు.

అయితే, బాలికల పరిస్థితి విషమించడంతో.. తమ కుమార్తెలను పాము కరిచినట్లు పోలీసులకు చెప్పాలని తల్లిని బెదిరించారు నలుగురు నిందితులు. బాలికలను ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరూ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రాణభయంతో బాలికల తల్లి.. తమ పిల్లలను పాము కాటు వేసిందని ఆస్పత్రి సిబ్బందికి తెలియజేసింది. అయితే పోలీసులకు అనుమానం వచ్చి.. గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపెట్టింది ఆ తల్లి. పోస్ట్‌మార్టం నివేదికలో లైంగిక వేధింపులు, విషప్రయోగం జరిగినట్లు నిర్ధారణ అయ్యిందని ఎస్‌హెచ్ఓ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

ఇదిలాఉండగా.. మరో ఘటనలో ఓ యువకుడి వేధింపుల కారణంగా మైనర్ బాలిక(17) ఆత్మహత్యకు పాల్పడింది. పటౌడీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ దీపక్ సంధు మాట్లాడుతూ.. యువకుడి వేధింపులు తాళలేక బాలిక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Immunity booster : పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఆహారాన్ని తినిపించండి..

Viral Video: హలో బ్రదర్ ఇదేం డ్యాన్స్.. ఇలా కూడా చేస్తారా?.. వీడియో చూడండి.. కడుపుబ్బా నవ్వుకోండి..

Hyderabad: సినీ ఫక్కీలో చోరీ.. ఉలిక్కిపడిన పాతబస్తీ.. బైక్‌లపై చేజ్ చేసి మరీ అందినకాడికి దోచుకెళ్లారు..