AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neeraj Chopra: మీకు ప్రేయసి ఉందా?.. ప్రశ్నించిన యాంకర్.. అదిరిపోయే రిప్లయ్ ఇచ్చిన ‘నీరజ్ చోప్రా’..

Neeraj Chopra: టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారతదేశానికి అథ్లెటిక్స్‌లో చారిత్రాత్మక బంగారు పతకాన్ని సాధించిన తరువాత దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరి నోట నీరజ్ చోప్రా..

Neeraj Chopra: మీకు ప్రేయసి ఉందా?.. ప్రశ్నించిన యాంకర్.. అదిరిపోయే రిప్లయ్ ఇచ్చిన ‘నీరజ్ చోప్రా’..
Neeraj Chopra
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 11, 2021 | 6:49 AM

Share

Neeraj Chopra: టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారతదేశానికి అథ్లెటిక్స్‌లో చారిత్రాత్మక బంగారు పతకాన్ని సాధించిన తరువాత దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరి నోట నీరజ్ చోప్రా అన్న మాటే వినిపిస్తోంది. మీడియా మొదలు, సోషల్ మీడియా వరకు ప్రతీ చోటా అతని పేరు మారిమోగిపోతోంది. ఒలింపిక్స్ విజేత కావడంతో.. సోషల్ మీడియాలో నీరజ్ చోప్రా ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారు. గోల్డ్ మెడల్ సాధించిన తరువాత నీరజ్ చోప్రా ఫాలోవర్స్ సంఖ్య 20 లక్షలకు పైగా పెరిగింది. ఇక ఇన్‌స్టాగ్రమ్‌లో ఏ పోస్ట్ చూసినా నీరజ్ గురించే అంటే అతిశయోక్తి కాదు.

కాగా, బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా అమ్మాయిల్లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. గోల్డ్ మెడల్ సాధించిన తరువాత నీరజ్ హాట్ ట్రెండ్ అయ్యాడు. అతను నేషనల్ క్రష్‌గా పిలవబడ్డాడు. నీరజ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు అమ్మాయిలు గూగుల్‌ను సెర్చ్ చేసేస్తున్నారు. అతని కెరీర్, ఆహారం, కుటుంబం, ప్రేమ జీవితం, గర్ల్‌ఫ్రెండ్స్ వంటి వివరాల కోసం తెగ వెతికేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే.. నీరజ్‌ పలు టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే, ఇంటర్వ్యూ తీసుకునే యాంకర్స్ సైతం నీరజ్ పర్సనల్ లైఫ్ గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్.. నీరజ్ చోప్రా ప్రేయసి గురించి ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు నీరజ్ కాస్త అసౌకర్యంగా ఫీల్ అయ్యాడు. ఒలింపిక్స్ విజయం తరువాత.. దేశంలోనే యువతులు అంతా అతనిపట్ల క్రష్ కలిగి ఉననారని, మీ స్పందనేంటి అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలన్నింటికీ నీరజ్ ఒక్కటే సమాధానం చెప్పాడు. ప్రజలు తనను ఇష్టపడటం సంతోషమే అని, అయితే, ప్రస్తుతానికి తన దృష్టి అంతా గేమ్స్‌పైనే అని స్పష్టం చేశాడు. అయితే, సదరు జర్నలిస్ట్.. నీరజ్‌ను మాత్రం వదిలిపెట్టడం లేదు. నీకు ప్రేయసి ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. నీరజ్ అదే సమాధానం చెప్పినా వినిపించుకోకుండా.. మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలు వేశారు. దాంతో నీరజ్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు.. సదరు యాంకర్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇదేం చెత్త ఇంటర్వ్యూ అంటూ క్లాస్ పీకారు.

Also read:

Crime News: తల్లిని బెదిరించి ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి..

Immunity booster : పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఆహారాన్ని తినిపించండి..

Viral Video: హలో బ్రదర్ ఇదేం డ్యాన్స్.. ఇలా కూడా చేస్తారా?.. వీడియో చూడండి.. కడుపుబ్బా నవ్వుకోండి..