Chiranjeevi-Meerabai Chanu: నీ మనసు నిజంగానే బంగారం అంటూ మీరాబాయి పై చిరంజీవి ప్రశంసల జల్లు

Chiranjeevi-Meerabai Chanu: టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొదటి పతకం అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను..ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం కలదని పలు సందర్భాల్లో వెల్లడైంది. మధ్య తరగతి కుటుంబం నుంచి..

Chiranjeevi-Meerabai Chanu: నీ మనసు నిజంగానే బంగారం అంటూ మీరాబాయి పై చిరంజీవి ప్రశంసల జల్లు
Chiru Meerabai Chanu
Follow us
Surya Kala

|

Updated on: Aug 10, 2021 | 12:47 PM

Chiranjeevi-Meerabai Chanu: టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొదటి పతకం అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను..ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం కలదని పలు సందర్భాల్లో వెల్లడైంది. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మీరాబాయి చాను విశ్వ క్రీడల్లో భారత మువ్వన్నెల జెండాను ఎగురవేసి భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత ఫుల్ బిజీగా గడపున్నారు.  శిక్షణా కేంద్రానికి వెళ్లేందుకు రెగ్యులర్‌గా లిఫ్ట్‌ అందించిన ట్రక్కర్లను కలిసి, వారి ఆశీర్వాదం తీసుకుంది మీరాబాయి. ఇదే విషయంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నువ్వు శిక్షణ కోసం వెళ్లివస్తున్న సమయంలో నీకు సాయం చేసిన 150 మందిని గుర్తు పెట్టుకోవడం గొప్ప విషయం. వారిని నువ్వు సన్మానించిన తీరు నీ మంచి మనసుకు నిదర్శనం.. చేసిన సాయం గుర్తు పెట్టుకుని ఇంటికి పిలిచి మరీ సన్మానించిన నీ మనసు నిజంగా బంగారం అని మీరాబాయి చాను పై చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రశంసలు వర్షం కురిపించారు.

మీరాబాయి మణిపూర్ లోని నాంగ్‌పాక్ కాచింగ్ గ్రామంలో జన్మించిన మీరాబాయి చాను చిన్నతనంలో స్వగ్రామంలో ప్రాక్టీస్ చేసేవారు. అనంతరం గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలోని ఇంపాల్ కు శిక్షణ నిమిత్తం ప్రతి రోజు వెళ్లి వచ్చే వారు. రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో శిక్షణకు వెళ్ళడానికి మీరా ట్రక్కులో పయనించే వారు. ఈ నేపథ్యంలో మీరాబాయి అకాడమీకి వెళ్లేందుకు సహకరించిన 150 మంది ట్రక్కు డ్రైవర్లను గుర్తు పెట్టుని ఇంటికి పిలిచి భోజనం పెట్టి వారికి ఒక ష‌ర్ట్‌, మ‌ణిపురి కండువాను బహుమానంగా ఇచ్చి సత్కరించింది. అంతేకాదు.. తాను కష్టపడుతున్న సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరినీ పలకరించి.. తన విజయానికి తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ తన వంతు సాయం అందిస్తున్నారు.

Also Read: Heartbreaking Olympics: ఒలింపిక్స్‌‌లో పతాకానికి దగ్గరకు వచ్చి.. లాస్ట్‌లో మిస్ చేసుకున్న భారత రెజ్లర్లు వీరే..