AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heartbreaking Olympics: ఒలింపిక్స్‌‌లో పతకానికి దగ్గరకు వచ్చి.. లాస్ట్‌లో మిస్ చేసుకున్న భారత రెజ్లర్లు వీరే..

Olympics Indian Wrestlers: 125 ఏళ్ల ఆధునిక ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు ఇప్పటివరకూ సాధించిన అత్యధిక పతకాలు ఏడు. అయితే ఈ విశ్వక్రీడల్లో పాల్గొనాలని ప్రతి ఒక్క క్రీడాకారుడు కోరుకుంటాడు. అలా పాల్గొనడం గొప్ప అయితే.. అదే తమ దేశ పతాకం ఎగురవేస్తూ.. పతకం సాధిస్తే మరింత గొప్ప. అయితే మనదేశంలో ఎంతో మంది క్రీడాకారులు విజయం వరకూ చేరుకొని తృటిలో చేజార్చుకున్నారు. రెజ్లింగ్‌లోపతకం కోల్పోయిన క్రీడాకారుల వివరాలకు చూద్దాం..

Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 10, 2021 | 12:35 PM

Share
1920 లో ఆంట్‌వెర్ప్ ఒలింపిక్స్‌లో, రెజ్లర్ రణధీర్ షిండే గ్రేట్ బ్రిటన్‌కు చెందిన ఫిలిప్ బెర్నార్డ్‌తో జరిగిన పురుషుల ఫెదర్ వెయిట్ ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం ప్లేఆఫ్‌లో ఓడిపోయాడు. అతను క్వార్టర్ ఫైనల్‌లో హెన్రీ ఇన్‌మాన్ (గ్రేట్ బ్రిటన్)ను, సెమీస్‌లో సామ్ గెర్సన్ (USA) లను ఓడించాడు.

1 / 5
ఫ్రీస్టైల్ రెజ్లర్ కేశవ్ మంగవే పురుషుల ఫ్రీస్టైల్ 62 కేజీల (ఫెదర్ వెయిట్) ఈవెంట్‌లో 5 వ రౌండ్‌కు చేరుకున్నాడు. అయితే USA క్రీడాకారుడు జోషియా హెన్సన్ చేతిలో ఓడిపోయాడు. కేశవ్ మంగవే నాలుగో స్థానంలో నిలిచాడు.

2 / 5
ఫ్రీస్టైల్ రెజ్లర్ ప్రేమ్ నాథ్ ఏడవ రౌండ్ వరకు పోరాడారు. మొత్తం తొమ్మిది పెనాల్టీ పాయింట్లతో నిలిచి పతకం కోసం పోటీపడ్డారు. అయితే అప్పుడు స్కోర్లను అన్ని ప్రాథమిక రౌండ్ల ముగింపుతో లెక్కించారు. దీంతో అతి తక్కువ పెనాల్టీలతో ముగ్గురు రెజ్లర్లు పతకాలు సాధించారు.

3 / 5
 ప్రేమ్ నాథ్ లాగే, సుదేశ్ కుమార్ కూడా రోమ్ గేమ్స్‌లో పతకానికి దగ్గరగా వచ్చాడు. సుధేష్ ఏడు పెనాల్టీ పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచాడు.

4 / 5
రెజ్లర్లు ఒలింపిక్ పతకానికి దగ్గరగా రావడం  లాస్ ఏంజిల్స్ గేమ్స్‌లో కొనసాగింది. చివరి రౌండ్ వరకు రెండో స్థానంలో ఉన్న రాజీందర్ సింగ్ చివరి రౌండ్‌లో సబాన్ సెజ్దీ చేతిలో కాంస్య పతకాన్ని కోల్పోయారు.

5 / 5