- Telugu News Photo Gallery Cricket photos Dhoni's Chennai Super kings Player Imran Tahir score hattrick in the hundred tornament
19 బంతుల్లో హ్యాట్రిక్‌తో సహా 5 వికెట్లు.. 42 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్.. అతనెవరంటే?
ఈ టోర్నమెంట్‌లో హ్యాట్రిక్ సాధించిన అత్యధిక వయసు గల ఆటగాడిగా రికార్డు సాధించాడంతో పాటు తన జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.
Updated on: Aug 11, 2021 | 7:08 AM

ఆదివారం ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో జరిగిన మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ 93 పరుగుల తేడాతో వెల్ష్ ఫైర్‌ని ఓడించింది. బర్మింగ్‌హామ్‌కు చెందిన ఒక బౌలర్ ఈ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆ ఆటగాడి పేరు ఇమ్రాన్ తాహిర్. ఈ మ్యాచ్‌లో తాహిర్ మొత్తం 5 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది.

ఈ మ్యాచ్‌లో తాహిర్ మొత్తం 19 బాల్స్ సంధించి 25 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో 72, 73, 74 వ బంతుల్లో హ్యాట్రిక్ సాధించాడు. దీంతోనే వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. వెల్ష్ ఫైర్ బ్యాట్స్‌మెన్లలో అహ్మద్, మాట్ మిల్నెస్, డేవిడ్ పేన్‌లు తాహిర్ హ్యాట్రిక్‌లో బాధితులు అయ్యారు. ఈ మూడు వికెట్లే కాకుండా అతను గ్లెన్ ఫిలిప్స్, ల్యూస్ డు ప్లాయ్ వికెట్లను కూడా పడగొట్టాడు.

ఈ టోర్నమెంట్‌లోనే అధిక వయసు గల ఆటగాడిగా ఇమ్రాన్ తాహిర్ ఈ టోర్నమెంట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇది టోర్నీలోనే మొదటి హ్యాట్రిక్‌గా నమోదైంది. తాహిర్ వయస్సు 42 సంవత్సరాలు. అతను ఈ వయస్సులోనూ అద్భుతాలు చేస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కూడా ఆడాడు. సీఎస్‌కే జట్టులోనూ కీలకంగా ఎదిగాడు.

ఇప్పటివరకు తాహిర్ మొత్తం 59 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 82 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ -14 వాయిదాకు ముందు, తాహిర్ ఒక మ్యాచ్ మాత్రమే ఆడి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ వచ్చే నెల నుంచి మరలా మొదలుకానుంది. దీంట్లో సీఎస్‌కే జట్టులో ప్రముఖ పాత్ర పోషించేందుకు సిద్ధమైనట్లు సిగ్నల్ ఇచ్చాడు.

అయితే, తాహిర్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతను 2019 ప్రపంచ కప్ తర్వాత వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను అన్ని దేశాల టీ 20 లీగ్‌లలో పాల్గొంటున్నాడు. ఐపీఎల్‌తో పాటు, అతను పీఎస్‌ఎల్, సీపీఎల్‌లో కూడా ఆడుతున్నాడు.




