Periodontal Disease: మీకూ నోటి చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుందా? ఐతే ఏ క్షణమైనా హార్ట్ ఎటాక్..
కొంతమందికి పళ్ళు తోముకునేటప్పుడు, తినేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరుగుతుంది. ఇది క్రమం తప్పకుండా జరిగితే మందులు తీసుకుంటారు. అది నయమైతే అంతటితో వదిలేస్తారు. కానీ హార్వర్డ్ హెల్త్ వెల్లడించిన సమాచారం ప్రకారం..చిగుళ్ళలో వాపు, రక్తస్రావం వంటి సమస్యలను ఎదుర్కొనే వ్యక్తికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది..

చిగుళ్ళలో రక్తస్రావం అనేది దంత ఆరోగ్యానికి మాత్రమే సంబంధించినదని అందరూ అనుకుంటారు. కానీ దీని వెనుక వివిధ కారణాలు ఉన్నాయని మీకు తెలుసా? గుండె జబ్బు ఉన్నవారిలో చిగుళ్ళలో రక్తస్రావం జరుగుతుందని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. హార్వర్డ్ హెల్త్ నిర్వహించిన ఈ అధ్యయనం మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నోటి ఆరోగ్యం మంచిది కాకపోయినా, పేలవంగా ఉన్నా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని పేర్కొంది. ఎందుకంటే చిగుళ్ళకు, గుండెకు మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో అని అందరూ అనుకుంటారు. కానీ పరిశోధకులు దీని గురించి మరింత సమాచారం అందించారు. నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో కొన్ని విషయాలు కూడా పంచుకున్నారు. ఇక్కడ ఆ వివరాలు తెలుసుకుందాం..
కొంతమందికి పళ్ళు తోముకునేటప్పుడు, తినేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరుగుతుంది. ఇది క్రమం తప్పకుండా జరిగితే మందులు తీసుకుంటారు. అది నయమైతే అంతటితో వదిలేస్తారు. కానీ హార్వర్డ్ హెల్త్ వెల్లడించిన సమాచారం ప్రకారం..చిగుళ్ళలో వాపు, రక్తస్రావం వంటి సమస్యలను ఎదుర్కొనే వ్యక్తికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.
అధ్యయనం ఏం చెబుతోందంటే?
చిగుళ్ల వ్యాధికి, గుండె జబ్బులకు ప్రత్యక్ష సంబంధం ఉందా లేదా అనేది స్పష్టంగా తెలియదు. కానీ పరిశోధకులు దీనికి ఒక కారణం ఉందని చెబుతున్నారు. చిగుళ్లలో రక్తస్రావం కలిగించే బ్యాక్టీరియా దీనికి కారణం. అదే బ్యాక్టీరియా నోటి ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశించి రక్త నాళాలలో వాపును పెంచుతుంది. ఫలితంగా ఇది గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది బ్యాక్టీరియా వల్ల మాత్రమే కాదు. చిగుళ్లలో రక్తస్రావం అయినప్పుడు, రోగనిరోధక వ్యవస్థ కూడా క్షీణిస్తుంది. ఈ ప్రతిచర్య రక్త నాళాలను దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు. గుండెకు, దంతాలకు హాని కలిగించే అలవాట్ల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ధూమపానం ప్రధాన కారకం. కొన్ని సందర్భాల్లో వంశపారంపర్యంగా కూడా ఇలా జరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల నోటి ఆరోగ్యమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. కానీ చిగుళ్ళ నుంచి రక్తస్రావం కావడానికి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అశ్రద్ధ చేయకూడదు.
లక్షణాలు ఏమిటి?
నోరు బ్రష్ చేసుకున్నప్పుడు చిగుళ్ళ నుండి రక్తం కారుతుంది. దుర్వాసన కూడా వస్తుంది. ఆహారాన్ని నమలడం ఇబ్బందిగా ఉంటుంది. దంతాలు సాధారణం కంటే పెద్దవిగా కనిపిస్తాయి. కొన్నిసార్లు అవి ఊడిపోయే అవకాశం కూడా ఉంది. కొన్ని అలవాట్లు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. అధికంగా ధూమపానం, గుట్కా నమలడం వల్ల ఈ సమస్య వస్తుంది. వీటివల్ల నోటిలో బాక్టీరియా ఏర్పడుతుంది. దీంతో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి చిగుళ్ళ నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
దీన్ని ఎలా నివారించాలి?
ఊబకాయం కూడా దీనికి కారణం కావచ్చు. శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ రకమైన సమస్య వస్తుంది. ఇది మాత్రమే కాదు, ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తుంది. కానీ మీరు నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అలాంటి సమస్యలను నివారించవచ్చు. రోజుకు కనీసం రెండుసార్లు పళ్ళు తోముకోవడం చాలా అవసరం. మృదువైన బ్రష్‌లు మాత్రమే ఉపయోగించాలి. మూడు నెలల కంటే ఎక్కువ కాలం బ్రష్‌ను ఉపయోగించకూడదు. ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌ను ఉపయోగించాలి. మౌత్ వాష్‌ను ఉపయోగించడం మంచిది. అంతేకాకుండా క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం వల్ల ఈ సమస్య రాకుండా నిరోధించవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








