AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: బంధం మరింత బలపడాలని.. ఈ తప్పులు చేస్తే.. మిమ్మల్ని మీరు కోల్పోవడమే కాదు.. భాగస్వామి కూడా విసుగే..

అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు.. ఒకొక్కసారి జీవిత భాగస్వామిపై ఉన్న ప్రేమతో.. అవసరానికి మించి అవతలి వ్యక్తి జీవితంలో తొంగి చూస్తే.. సంబంధాల మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంది.

Relationship Tips: బంధం మరింత బలపడాలని.. ఈ తప్పులు చేస్తే.. మిమ్మల్ని మీరు కోల్పోవడమే కాదు.. భాగస్వామి కూడా విసుగే..
Relationship Tips
Surya Kala
|

Updated on: Aug 22, 2022 | 5:42 PM

Share

Relationship Tips: బంధాలు, అనుబంధాలు గుర్తెరిగి ఇతరులతో కలిసి జీవిస్తేనే.. జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.  బంధాలు చాలా  సున్నితమైనవి.. అయినప్పటికి.. బంధాలను విచ్ఛిన్నం కాకుండా సరైన పద్దతిలో మార్గంలో నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే మారుతున్నా కాలంతో పాటు.. బంధాల తీరు కూడా మారిపోయింది. తమ జీవితాన్ని ఎలా గడపాలో మర్చిపోతున్నారు. కొన్నిసార్లు కొందరు వ్యక్తులు ప్రత్యేక సంబంధాన్ని గుర్తించడంలో వెనుకబడుతున్నారు. వారు తమను తాము కోల్పోవడం ప్రారంభిస్తారు. ఈ పొరపాటు వల్ల తర్వాత పశ్చాత్తాపపడడం తప్ప ఏమీ మిగలదు. ఈరోజు మనం వైవాహిక జీవితం లేదా ప్రేమ సంబంధం గురించి తెలుసుకుందాం. కొంతమందికి తమ భాగస్వామితో బంధాన్ని అందంగా మలచుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ బంధాలు – అనుబంధాలు.. అన్నట్టుగా కలిసి జీవిస్తేనే జీవితం ఆనందమయం అవుతుంది. భాగస్వామి సంతోషాన్ని, దుఃఖాన్ని తమ సొంతం చేసుకోవడం.. తమ భావాలను మరచిపోవడం కొంతమంది స్వభావం. సంబంధాన్ని అందంగా ఏర్పాటు చేసుకోవాలనే తపనలో వ్యక్తులు తమను తాము ఎలా కోల్పోవడం ప్రారంభిస్తారో చెప్పడానికి ఈరోజు  ప్రయత్నం చేస్తున్నాం. భాగస్వామి అతిప్రేమతో సర్వసాధారణంగా చేసే తప్పుల గురించి తెలుసుకోండి.

అన్ని వేళలా క్షమించండి ప్రేమ, నమ్మకంతో పాటు, సంబంధంలో గౌరవం కూడా ముఖ్యం. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేతంటాగా భాగస్వామిని ప్రేమించడం.. ఒకొక్కసారి భాగస్వామికి ప్రమాదకరంగా మారవచ్చు. రిలేషన్ షిప్ లో గొడవ ఏర్పడినప్పుడు సారీ అని చెప్పి ముగించడం మంచిదే.. అయితే ప్రతి విషయంలో సారీ చెప్పడం మంచిది కాదు. భాగస్వామికి సారీ చెప్పే బదులు, పరిస్థితిని అర్థం చేసుకునే విధంగా నచ్చచెప్పడం మంచిది. క్షమించండి అని చెప్పే బదులు.. తప్పు ఎందుకు జరిగిందే వివరించండి.

అతిప్రేమ  రిలేషన్ షిప్ లో ప్రేమ చూపించడం మంచిదే. అయితే ప్రేమ పేరుతో భాగస్వామి చుట్టూ తిరగడం మంచిది కాదు. సంబంధం ఏర్పడిన కొత్తలో  భాగస్వామి మీ ఈ స్వభావాన్ని తట్టుకోగలరు. అలా భాగస్వామి చుట్టూ తిరుగుతుంటే.. ఏదో ఒక సమయంలో అవతలి వారికీ చిరాకురావచ్చు.  భాగస్వామిగురించి మాత్రమే కాదు.. మీ వ్యక్తిగత జీవితానికి కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఒకొక్కసారి దంపతుల మధ్య ఏర్పడే దూరం వారిని మరింత దగ్గర చేస్తుంది.

ఇవి కూడా చదవండి

భాగస్వామి అవసరాలను తీర్చడమే ధ్యేయంగా జీవిస్తే.. 

అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు.. ఒకొక్కసారి జీవిత భాగస్వామిపై ఉన్న ప్రేమతో.. అవసరానికి మించి అవతలి వ్యక్తి జీవితంలో తొంగి చూస్తే.. సంబంధాల మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి తన జీవిత భాగస్వామి అవసరాలను తీర్చడం పేరుతో చేసే అతి సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. తన భార్య కోసం అంటూ భర్త అన్ని సమయాలలో వస్తువులను పోగు చేస్తూనే ఉంటాడు. కొంతమంది భర్తలు తమ కోసం వస్తువులను కొనుగోలు చేయరు. ఎల్లప్పుడూ తమ భార్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే భార్యపై సంబంధాన్ని పొందడానికి మిమ్మల్ని మీరు కోల్పోయే తప్పు చేస్తున్నారని ఈ ప్రవర్తన స్పష్టంగా చూపిస్తుంది. మీ భార్యని జాగ్రత్తగా చూసుకోండి.. అయితే అదే సమయంలో మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..