Leg Cramps: నిద్రలో కండరం పట్టేసిందా.. ఈ చిట్కాలతో వెంటనే సెట్ అవుతుంది..

గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కోసారి కాలులోని నరం పట్టేస్తుంది. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. కండరం పట్టేడయంతో ఎంత నిద్రలో ఉన్నవారైనా ఒక్కసారిగా ఉలిక్క పడి లేస్తూ ఉంటారు. వెంటనే కేకలు వేస్తూ నొప్పితో బాధ పడుతూ ఉంటారు. ఈ నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. తట్టుకోవడం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. మళ్లీ కాలి కండరం సెట్ అయ్యేంత వరకు ఆ నొప్పి తట్టుకోవడం చాలా కష్టం. కాలు అటూ ఇటూ కదపలేరు. కాలు అస్సలు సహకరించదు. చాలా నొప్పితో కొంత మంది..

Leg Cramps: నిద్రలో కండరం పట్టేసిందా.. ఈ చిట్కాలతో వెంటనే సెట్ అవుతుంది..
Leg Cramps
Follow us

|

Updated on: Oct 02, 2024 | 3:27 PM

గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కోసారి కాలులోని నరం పట్టేస్తుంది. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. కండరం పట్టేడయంతో ఎంత నిద్రలో ఉన్నవారైనా ఒక్కసారిగా ఉలిక్క పడి లేస్తూ ఉంటారు. వెంటనే కేకలు వేస్తూ నొప్పితో బాధ పడుతూ ఉంటారు. ఈ నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. తట్టుకోవడం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. మళ్లీ కాలి కండరం సెట్ అయ్యేంత వరకు ఆ నొప్పి తట్టుకోవడం చాలా కష్టం. కాలు అటూ ఇటూ కదపలేరు. కాలు అస్సలు సహకరించదు. చాలా నొప్పితో కొంత మంది ఏడుస్తూ ఉంటారు. ఈ నొప్పిని వర్ణించడం కూడా కష్టమే. సాధారణంగా ఉండే జలదరింపుల కంటే కండరం పట్టేయడం భరించలేనంత నొప్పిగా ఉంటుంది. కొన్ని క్షణాల పాటు సదరు వ్యక్తి ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఈ సమస్యను ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే ఉంటారు. మరి ఇలా కాలులో కండరం ఎందుకు పట్టేస్తుంది? ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

రాత్రి పూట కాలి నరాలు, కండరాలు పట్టే సమస్యలో 60 శాతం మందికి పైగానే ఉంటుంది. ఈ కండరాల తిమ్మిరి సమస్యను చార్లీ హార్స్ అని కూడా పిలిస్తారు. కాలులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కండరాలు అకస్మాత్తుగా బిగుసుకు పోయినప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది. చీల మండలం నుండి పాదం వెనక భాగంలో మోకాలి వరకు ఉండే కండరాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

డీహైడ్రేషన్:

డీహైడ్రేషన్ కారణంగా కూడా కాళ్లలో నరం పట్టేడయం, తిమ్మిరికి కారణం అవుతుంది. శరీరానికి కావాల్సినంత నీరు అందలేనప్పుడు కండరాలు అనేవి సక్రమంగా పని చేయలేవు. దీంతో కండరాలు, నరాలు పట్టేస్తూ ఉంటాయి. కాబట్టి నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. అదే విధంగా ఎలక్ట్రోలైట్ అసమతులత్య వల్ల కూడా ఇలా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మసాజ్ చేయాలి:

చాలా మందిలో నిద్రలో ఉన్నప్పుడు కండరాలు పట్టేస్తూ ఉంటాయి. ఇలా నొప్పి నుంచి ఉపశమనం పొందిన తర్వాత.. కండరాన్ని తేలికగా రుద్దుతూ నూనెతో మర్దనా చేయాలి. ముందుకూ వెనక్కి కాలిని కదిలించాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

వేడి కాపడం:

నరాలు, కండరాలు పట్టినప్పుడు వచ్చే నొప్పిని తగ్గించడానికి వేడి నీటితో కాపడం పెట్టి, రుద్దడం వల్ల కూడా రిలీఫ్ పొందవచ్చు. ఆ తర్వాత నూనెతో మసాజ్ చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ నొప్పులు వచ్చినప్పుడు నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగడం వల్ల కూడా రిలీఫ్ దొరుకుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!