ఉసిరితో ఎన్నో బెనిఫిట్స్.. రోజూ తింటే మీ శరీరంలో వచ్చే మార్పులివే..!

ఉసిరిని సింపుల్‌గా సూపర్‌ ఫుడ్‌ అని పిలుస్తారు. ఉసిరిలో విటమిన్‌ సీ,¯ కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, బీ–కాంప్లెక్స్‌తోపాటు ఇతర విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఔషధ గుణాలూ పుష్కలంగా ఉంటాయని నిపుణుల చెబుతున్నారు. ఉసిరి రోజు తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉసిరితో ఎన్నో బెనిఫిట్స్.. రోజూ తింటే మీ శరీరంలో వచ్చే మార్పులివే..!
Amla
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 03, 2024 | 10:00 AM

వచ్చేది ఉసిరికాయల సీజన్.. ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఉసిరితో ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు తగ్గించుకోవచ్చు. ప్రాచీన కాలం నుంచి ఉసిరిని ఔషధంగా వాడుతున్నారు.. ఉసిరిని నేరుగా తిన్నా.. జ్యూస్ తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరిని సింపుల్‌గా సూపర్‌ ఫుడ్‌ అని పిలుస్తారు. ఉసిరిలో విటమిన్‌ సీ,¯ కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, బీ–కాంప్లెక్స్‌తోపాటు ఇతర విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఔషధ గుణాలూ పుష్కలంగా ఉంటాయని నిపుణుల చెబుతున్నారు. ఉసిరి రోజు తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉసిరిని ఎలా తీసుకున్నా శరీరానికి పోషకాలు అందుతాయి. అయితే ముఖ్యంగా ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఉసిరి తినడం వల్ల మరింత బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి కాయ నమిలి తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్యషధంగా పని చేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిన అదుపులో ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. అధిక బరువు తగ్గాలి అనుకునే వారు ఉసిరి తినడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఉసిరిలో ఫైబర్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇది త్వరగా ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

ఉసిరిలో ఉండే పోషకాలు గట్ హెల్త్‌కి చాలా మంచి చేస్తుంది. మల బద్ధకం సమస్య, చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది. ఉసిరి కాయ నమిలి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గునాలు, యాంటీ గ్లైసమిక్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉసిరి నమిలి తినడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. ముడతలు, మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం క్లియర్‌గా అవుతుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఉసిరి తినడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది. జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది. కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు కూడా నిగనిగలాడుతూ ఉంటుంది. ఉసిరి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక