తిరుమల శ్రీవారి పూల అలంకారంలో దాగిన విశేషాలు తెలుసా..! ఎన్ని రకాల హారాలు వాడతారంటే..
తిరుమల వెంకన్న. అభిషేక ప్రియుడే కాదు అలంకార ప్రియుడు కూడా. కోట్లాదిమంది భక్తుల ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుని అలంకారం భక్తుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. వజ్ర వైడూర్యాలు బంగారు ఆభరణాలు ధరించి భక్తులకు దర్శనం ఇచ్చి అలంకార ప్రియుడి సేవలో అనునిత్యం తరిస్తున్న పూదండలది ప్రత్యేక స్థానం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామి పుష్పాలంకార ప్రియుడుగా భక్తులను కనువిందు చేస్తున్నాడు. శ్రీనివాసునికి చేసే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనదిగా నిలిచింది. పవిత్రమైన కార్యమని తిరువాయ్ మొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలోనూ ఈ విషయం ఉంది. స్వామివారి ఆపాదమస్తకం వివిధ రకాల సుగంధ భరిత కుసుమాలతో అలంకరించే అర్చకులు ఎన్నో పుష్పహారాలను దేవదేవునికి సమర్పిస్తారు.

1 / 14

2 / 14

3 / 14

4 / 14

5 / 14

6 / 14

7 / 14

8 / 14

9 / 14

10 / 14

11 / 14

12 / 14

13 / 14

14 / 14
