Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త.. సంక్రాంతి నుంచి అమల్లోకి మరో కొత్త కార్యక్రమం.. !!

బందర్‌లో పర్యటించిన సీఎం చంద్రబాబు 2047 కల్లా భారత్‌ ప్రపంచంలోనే సూపర్‌ పవర్‌గా మారబోతుందన్నారు. ప్రగతిపథంలో దూసుకెళ్లాలంటే హార్డ్‌ వర్క్‌ తో పాటు స్మార్ట్‌ వర్క్‌ చేయాలన్నారు. టెక్నాలజీని , ఇంటెలిజెన్సీ ని వాడుకుంటూ ముందుకు సాగాలన్నారు. అభివృద్ది అంశాలతో పాటు

Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త.. సంక్రాంతి నుంచి అమల్లోకి మరో కొత్త కార్యక్రమం.. !!
Ap Cm
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 03, 2024 | 7:47 AM

ఏపీ ప్రజలకు సర్కార్‌ శుభవార్తనందించింది. సంక్రాంతి నుంచి మరో కార్యక్రమం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పేదరికంలేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా P-4 కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. సూపర్ సిక్స్ అమల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. సంక్రాంతి నుంచి P4 ప్రొగ్రామ్‌ అమల్లోకి రాబోతుందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి నుంచి పీ4 కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

బందర్‌లో పర్యటించిన సీఎం చంద్రబాబు 2047 కల్లా భారత్‌ ప్రపంచంలోనే సూపర్‌ పవర్‌గా మారబోతుందన్నారు. ప్రగతిపథంలో దూసుకెళ్లాలంటే హార్డ్‌ వర్క్‌ తో పాటు స్మార్ట్‌ వర్క్‌ చేయాలన్నారు. టెక్నాలజీని , ఇంటెలిజెన్సీ ని వాడుకుంటూ ముందుకు సాగాలన్నారు. అభివృద్ది అంశాలతో పాటు కుటుంబనియంత్రణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం స్వర్ణాంధ్ర లక్ష్యంగా త్వరలో P4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. P4 అంటే ..పబ్లిక్‌..ప్రైవేట్‌ ..పీపుల్‌..పార్టనర్‌షిప్‌…పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సంక్రాంతి నుంచి అమల్లోకి రానున్న P4 కార్యక్రమాన్ని నిమ్మకూరులో పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు.

ఇక డ్వాక్రా సంఘాలకు MSME హోదా కల్పించడం సహా , స్వచ్చసేవకుల అభివృద్ధికి అన్ని విధాల చేయూతనిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతున్న P4 కార్యక్రమం ఎలా వుండబోతుంది. విధివిధానాలు ఎలా వుంటాయనే చర్చ జరుగుతోందిప్పుడు.

ఇవి కూడా చదవండి

‘P4’ అంటే: ‘P4’ అంటే ‘పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ మరియు పార్టనర్‌షిప్’. రాష్ట్రంలో కుల గణనకు బదులు నైపుణ్య గణన చేపట్టాలని నిర్ణయించామన్నారు సీఎం చంద్రబాబు. దీనిపై కేబినెట్‌లో చర్చించి ఆమోదించామని చెప్పారు. మానవ వనరులను పెట్టుబడిగా మార్చేందుకు మార్గదర్శకాలన్నింటినీ అందిపుచ్చుకుంటూ.. సంపద సృష్టించడమే లక్ష్యంగా చంద్రబాబు కార్యచరణ. స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రజలకు ఉపాధిని అంది. దీంతో ప్రతి కుటుంబంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం ఉంటుందన్నారు. తమ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తమ పార్టీ, కేంద్రం కలిసి పనిచేస్తాయని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..