Boat capsize: పడవ బోల్తా.. 100మందికిపైగా గల్లంతు!  వేడుకకు వెళ్లి వెస్తుండగా దుర్ఘటన

Boat capsize: పడవ బోల్తా.. 100మందికిపైగా గల్లంతు! వేడుకకు వెళ్లి వెస్తుండగా దుర్ఘటన

Jyothi Gadda

|

Updated on: Oct 03, 2024 | 12:46 PM

ఈ ఘటనలో 100 మందికి పైగా గల్లంతైనట్టుగా తెలిసింది. వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 100 మంది సామర్థ్యం కలిగిన బోటులో దాదాపు 300 మంది ప్రయాణం చేయడంతో పడవ బోల్తా పడినట్టుగా అధికారులు భావిస్తున్నారు.

నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 100మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 100 మందికి పైగా గల్లంతైనట్టుగా తెలిసింది. వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 100 మంది సామర్థ్యం కలిగిన బోటులో దాదాపు 300 మంది ప్రయాణం చేయడంతో పడవ బోల్తా పడినట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా వీరంతా ఓ వేడుకకు వెళ్ళి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గజ ఈతగాళ్లు, వాలంటీర్లు రంగంలోకి దిగి 150 మందిని రక్షించారు. ఇప్పటివరకు 11 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమవగా.. మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు, అధికారులు తెలిపారు. కాగా నైజర్ నదిలో పడవ ప్రమాదాలు జరగడం సాధారణంగా మారింది. గతేడాది నుండి ఇప్పటి వరకు ఇలాంటి పడవ ప్రమాదాలు దీంతో ఐదోదిగా తెలిసింది.

 మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Oct 03, 2024 07:10 AM