- Telugu News Lifestyle What happens if you drink water without brushing your teeth? Check Here is Details
Water: పళ్లు తోమకుండా నీళ్లు తాగుతున్నారా.. ఏం జరుగుతుందంటే..
సాధారణంగా చాలా మంది ఉదయం లేచిన తర్వాత మంచి నీళ్లు తాగడం అలవాటు. కొంత మంది బ్రష్ చేసి నీళ్లు తాగితే.. మరికొందరు మాత్రం బ్రష్ చేయకుండా పరగడుపున నీళ్లు తాగుతూ ఉంటారు. ఇలా బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రికి పడుకుని ఉదయం లేవగానే నోటి నిండా క్రిములు, బ్యాక్టీరియా ఉంటాయి. పళ్లపై, నాలుకపై అవి పేరుకు పోయి ఉంటాయి. ఇలా లేవగానే నోరు శుభ్రం చేసుకోకుండా..
Updated on: Oct 04, 2024 | 9:30 AM

సాధారణంగా చాలా మంది ఉదయం లేచిన తర్వాత మంచి నీళ్లు తాగడం అలవాటు. కొంత మంది బ్రష్ చేసి నీళ్లు తాగితే.. మరికొందరు మాత్రం బ్రష్ చేయకుండా పరగడుపున నీళ్లు తాగుతూ ఉంటారు. ఇలా బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రికి పడుకుని ఉదయం లేవగానే నోటి నిండా క్రిములు, బ్యాక్టీరియా ఉంటాయి. పళ్లపై, నాలుకపై అవి పేరుకు పోయి ఉంటాయి. ఇలా లేవగానే నోరు శుభ్రం చేసుకోకుండా.. ఆహారాలు తిన్నా.. తాగినా.. అవి కూడా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీని వల్ల అనేక వ్యాధులు రోగాలు ఎటాక్ చేస్తాయి. పళ్లు కూడా దెబ్బతింటాయి.

కానీ నీటిని మాత్రం తాగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే ఒక గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలో ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చెబుతున్నారు.

ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఉన్న టాక్సిన్స్, మలిన పదార్థాలు బయటకు పోతాయి. మల బద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు.

శరీరంలో కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే చర్మ సమస్యలు పోయి ఆరోగ్యంగా ఉంటుంది. చర్మానికి సహజంగానే మెరుపు వస్తుంది. సాధారణ నీళ్లు మాత్రమే కాకుండా గోరు వెచ్చని నీళ్లు కూడా తాగినా అనేక బెనిఫిట్స్ ఉన్నాయట. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




