- Telugu News Photo Gallery Do this if you want skin glow like celebrities, Check Here is Details in Telugu
Skin Glowing Tips: సెలబ్రిటీల స్కిన్ గ్లో కావాలంటే.. ఆరెంజ్ తొక్కలతో ఇలా చేయండి..
సెలబ్రిటీల్లా అందంగా కనిపించాలని.. ఆకర్షణీయంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ల గురించి చెప్పాల్సిన పని లేదు. సెలబ్రిటీల స్కిన్.. కాంతివంతంగా, మెరుస్తూ ఉంటుంది. వాళ్లు స్కిన్‌కి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సెలబ్రిటీల లాంటి స్కిన్‌ని మనం ఇంట్లో ఉండే పొందవచ్చు. ఆరెంజ్ పండు తొక్కలను ఇప్పుడు చెప్పినట్టు వాడితే.. మీ అందం ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. వీటిని ఆహారంతో..
Updated on: Oct 04, 2024 | 10:30 AM

సెలబ్రిటీల్లా అందంగా కనిపించాలని.. ఆకర్షణీయంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ల గురించి చెప్పాల్సిన పని లేదు. సెలబ్రిటీల స్కిన్.. కాంతివంతంగా, మెరుస్తూ ఉంటుంది. వాళ్లు స్కిన్‌కి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

సెలబ్రిటీల లాంటి స్కిన్‌ని మనం ఇంట్లో ఉండే పొందవచ్చు. ఆరెంజ్ పండు తొక్కలను ఇప్పుడు చెప్పినట్టు వాడితే.. మీ అందం ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. వీటిని ఆహారంతో పాటు తీసుకున్నా మంచి రిజల్ట్స్ వస్తాయి.

ఆరెంజ్ తొక్కల పొడిలో మెరిసే టాన్జేరిన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఫేస్ ప్యాక్‌లో ఉపయోగిస్తే చర్మం ఎంత కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. స్కిన్ లైటెనింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది.

ఆరెంజ్ పండు తొక్కల పొడిలో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి బాగా పట్టించాలి. ఓ పావు గంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌తో ముఖంపై ఉండే మురికి పోయి.. మంచి గ్లో వస్తుంది. మీరు ఏదైనా ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లే ముందు ఈ ప్యాక్ ఉపయోగించవచ్చు.

ఆరెంజ్ తొక్కల పొడి, పసుపు, తేనె ఈ మూడింటిని కలిపి ఫేస్ ప్యాక్‌గా వేసుకోవచ్చు. ఈ ప్యాక్‌ని ముఖానికి, మెడకు బాగా పట్టించి ఆరిపోయాక.. రోజ్ వాటర్ లేదా ఫేస్ క్లెన్సర్‌తో శుభ్రం చేస్తే.. మంచి గ్లో వస్తుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




