Sleep on Stomach: బోర్లా తిరిగి పడుకుంటున్నారా.. మిస్ కాకుండా ఇది చదవండి..

నిద్ర అనేది శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా చాలా ముఖ్యం. ప్రశాంతమైన నిద్ర శరీర అలసటనే కాకుండా.. మనసును కూడా రీఫ్రెష్ చేస్తుంది. రోజంతా తినకుండా ఉన్నా కానీ.. ఒక్క రాత్రి సరిగా నిద్రపోతే పడే ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. తలనొప్పి, వికారం, వాంతులు ఇలా చాలా రకాల సమస్యలు వస్తాయి. తాజాగా చేసిన పలు అధ్యయనాల ప్రకారం.. గుండె జబ్బులు, డయాబెటీస్, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వెల్లడయ్యింది. కాబట్టి నిద్ర చాలా ముఖ్యం. చాలా మందికి కొన్ని రకాల..

Sleep on Stomach: బోర్లా తిరిగి పడుకుంటున్నారా.. మిస్ కాకుండా ఇది చదవండి..
Sleep on Stomach
Follow us

|

Updated on: Oct 26, 2024 | 3:29 PM

నిద్ర అనేది శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా చాలా ముఖ్యం. ప్రశాంతమైన నిద్ర శరీర అలసటనే కాకుండా.. మనసును కూడా రీఫ్రెష్ చేస్తుంది. రోజంతా తినకుండా ఉన్నా కానీ.. ఒక్క రాత్రి సరిగా నిద్రపోతే పడే ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. తలనొప్పి, వికారం, వాంతులు ఇలా చాలా రకాల సమస్యలు వస్తాయి. తాజాగా చేసిన పలు అధ్యయనాల ప్రకారం.. గుండె జబ్బులు, డయాబెటీస్, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వెల్లడయ్యింది. కాబట్టి నిద్ర చాలా ముఖ్యం. చాలా మందికి కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి. అవి నిద్రలో కూడా ఉంటాయి. చాలా మందికి ఒక పొజీషన్‌లో పడుకుంటేనే నిద్ర పడుతుంది. ఇలా చాలా మంది బోర్లా పడుకుంటారు. ఇలా పడుకుంటేనే కొందరికి నిద్ర వస్తుంది. కానీ బోర్లా తిరిగి పడుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని.. ముఖ్యంగా మహిళలు ఇలా అస్సలు పడుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి బోర్లా తిరిగి పడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఛాతీ నొప్పి వస్తుంది:

బోర్లా తిరిగి పడుకోవడం వల్ల శ్వాసపై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా గుండెపై ఎఫెక్ట్ పడి రక్త పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ కూడా వస్తాయట. కాబట్టి ఈ పొజిషన్‌లో నిద్రించకపోతేనే మంచిది.

చర్మ సమస్యలు:

బోర్లా తిరిగి నిద్రించడం వలన చర్మ సమస్లయు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ముఖ్యంగా ముఖ సౌందర్యం దెబ్బతింటుందట. బోర్లా తిరిగి పడుకోవడం వల్ల చర్మానికి తగినంత ఆక్సిజన్ సరిగా అందదు. దీంతో చర్మం నిర్జీవంగా, గ్లోను పోతుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణ సమస్యలు:

బోర్లా తిరిగి పడుకోవడం వల్ల వచ్చే సమస్యల్లో జీర్ణ సమస్యలు కూడా ఒకటి. ఎందుకంటే వెనక్కి తిరిగి పడుకోవడం వల్ల పొట్టపై తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. తిన్న ఆహారం అరగక పోవడం, జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వంటివి జరుగుతుంది. శ్వాస కూడా సరిగా అందదు. ఉదర సంబంధిత సమస్యలు కూడా రావచ్చు.

వెన్నుముకపై ప్రభావం:

ఈ పొజిషన్‌లో నిద్రించడం వల్ల వెన్నుముకపూ కూడా ఎఫెక్ట్ పడుతుంది. బోర్లా తిరిగి పడుకుంటే.. వెన్నెముకకు అస్సలు మంచిది కాదు. మెడ నొప్పి, నడుము నొప్పి, కాళ్లు, చేతుల నొప్పులు కూడా రావచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!