Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో ఎదురీత.. వాయుగుండం, తుఫాన్లంటేనే మత్స్యకారుల్లో భయం భయం

అల్పపీడనం, వాయుగుండం, తుఫాన్‌.. ఈ పేర్లు వింటేనే మత్స్యకారుల వెన్నులో వణుకు పుడుతోంది. గత కొద్ది రోజులుగా వరుసగా సంభవిస్తున్న అల్పపీడనాలు కడలిని నమ్ముకుని జీవిస్తున్న వారి జీవితాలను దుర్భరంగ మార్చాయి. ఓ వైపు తుఫాన్లు, మరో వైపు వేట నిషేధం..

సముద్రంలో ఎదురీత.. వాయుగుండం, తుఫాన్లంటేనే మత్స్యకారుల్లో భయం భయం
Fishing
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 28, 2024 | 1:33 PM

మత్స్యకారులకు సముద్రమే దిక్కు.. ప్రాణాలను పణంగా పెట్టి చేపల వేట కోసం ఉప్పొంగుతున్న సముద్రంలో ఎదురీదుతుంటారు. అంత రిస్క్‌ తీసుకుంటేనే వారికి రెండు పూటల తిండి దొరుకుతుంది. చేపల వేట జీవన్మరణ సమస్యగా ఉంటుంది. ఇటీవల కాలంలో సముద్రంలో మత్స్య సంపద తగ్గడంతో వీరి పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైంది. వేటకు వెళ్లిన జాలర్లు వట్టి చేతులతో తిరిగి రావాల్సి వస్తున్నది. దీనికితోడు అల్పపీడనాలు వారాలు, నెలల తరబడి వేటకు వెళ్లకుండా చేస్తున్నాయి. దీంతో మత్స్యకార కుటుంబాల పరిస్థితి ఒడ్డున పడ్డ చేపల్లా తయారైంది.

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

ఉమ్మడి ప్రకాశం జిల్లా సముద్ర తీరంలోని 10 మండలాల్లో 74 గ్రామాలకు చెందిన 70 వేల మంది మత్స్యకారులు వేటనే జీవనాధారంగా జీవిస్తున్నారు. మత్స్యశాఖ గుర్తింపు పొందిన 42 మెకనైజ్డ్‌ బోట్లు, 2వేల 5వందల మోటారు బోట్లు ఉండగా.. మరో 1650 సంప్రదాయ పడవలున్నాయి. రెండు నెలల క్రితం సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో వేట నిషేధించారు. దీంతో వీరంతా 45 రోజుల పాటు జీవనోపాధిని కోల్పోయారు. గుర్తింపు పొందిన బోట్లు, పడవలపై వేట సాగించే వారికే ఏటా కరువు భత్యం చెల్లిస్తుండటంతో మిగతా వారు ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాకుండా వృద్ధులకు ఫించన్‌ వచ్చే కుటుంబాలకు ప్రభుత్వం అందించే మత్స్యకార భరోసా ఆర్థిక సాయం అందటం లేదు. ఈ పరిస్థితిలో వరుసగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల కారణంగా మళ్లీ వేటకు వెళ్లలేని దుస్థితి రావటంతో గంగపుత్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

వరుస అల్పపీడనాల కారణంగా తమను వేటకు వెళ్లవద్దంటున్న అధికారులు ఇటు ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని కొత్తపట్నం పల్లెపాలెం మత్స్యకారులు వాపోతున్నారు. చేపల వేట నిషేధం సమయంలో తమకు గత ఏడాది చెల్లించాల్సిన మత్స్యకార భరోసాను ఇంతవరకు చెల్లించలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరస్థితిలో వేట బాగా సాగితే బాగుండేదని, కానీ చేపలు కూడా అంతంతమాత్రంగానే పడుతున్నందున ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని తమ జీవితాలు అల్పపీడనాల సమయంలో మరింత దుర్భరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరుస తుఫాన్లు, అల్పపీడనాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్న మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మత్స్యకారుల సంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. మత్స్యకారుల భరోసా పథకాన్ని నీరుగార్చి ఇంతవరకు విడుదల చేయలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు అల్పపీడనాల సమయంలో వేటకు వెళ్లలేని వారు వ్యాపారుల దగ్గర అప్పు చేయడంతో తక్కువ ధరలకే చేపలు అమ్ముకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మత్స్యకార కుటుంబానికి పాతిక కిలోల బియ్యం, కందిపప్పు, నూనె తదితర నిత్యావసరాలను అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇది చదవండి: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

గత పదిహేను రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు తాజాగా తుఫాన్ల హెచ్చరికలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అటు వేటకు వెళ్లలేక.. ఇటు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నామని బాధిత మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చాణక్యనీతి : జాగ్రత్త.. ఈ నలుగురు వ్యక్తులకు అస్సలే అప్పు ఇవ్వకూడ
చాణక్యనీతి : జాగ్రత్త.. ఈ నలుగురు వ్యక్తులకు అస్సలే అప్పు ఇవ్వకూడ
1.80 లక్షల మోసపూరిత లింక్‌లను బ్లాక్‌ చేసిన ఎయిర్‌టెల్‌
1.80 లక్షల మోసపూరిత లింక్‌లను బ్లాక్‌ చేసిన ఎయిర్‌టెల్‌
తెలుగు తెరపై కాంతార బ్యూటీ..ఈ అమ్మడుకు లక్కు కలిసొస్తుందా?
తెలుగు తెరపై కాంతార బ్యూటీ..ఈ అమ్మడుకు లక్కు కలిసొస్తుందా?
అలసటను తగ్గించే ఐదు అద్భుతమైన యోగాసనాలు ఇవే !
అలసటను తగ్గించే ఐదు అద్భుతమైన యోగాసనాలు ఇవే !
జడ వేయకుండా కురులు వదిలేసే అమ్మాయిలకు షాక్‌..! త్వరలోనే మీ జుట్టు
జడ వేయకుండా కురులు వదిలేసే అమ్మాయిలకు షాక్‌..! త్వరలోనే మీ జుట్టు
నెట్టింట గత్తరలేపుతోన్న అరుంధతి డ్యాన్స్ టీచర్..
నెట్టింట గత్తరలేపుతోన్న అరుంధతి డ్యాన్స్ టీచర్..
వారి ఇంటి నుంచి దుర్గంధం.. పోలీసులు వెళ్లి చూడగా
వారి ఇంటి నుంచి దుర్గంధం.. పోలీసులు వెళ్లి చూడగా
విమాన ప్రమాదంలో సమస్తం అగ్నికి ఆహుతి ఒక్క భగవద్గీత తప్ప.. వీడియో
విమాన ప్రమాదంలో సమస్తం అగ్నికి ఆహుతి ఒక్క భగవద్గీత తప్ప.. వీడియో
ఒక్కసారే ఇల్లు కట్టాడు.. వాహనాలు కొన్నాడు.. పోలీసులు నజర్ పెట్టగా
ఒక్కసారే ఇల్లు కట్టాడు.. వాహనాలు కొన్నాడు.. పోలీసులు నజర్ పెట్టగా
UPSCలో TV రిపేర్‌మ్యాన్ కొడుకు సత్తా.. ప్రిపరేషన్ సీక్రెట్ తెలుసా
UPSCలో TV రిపేర్‌మ్యాన్ కొడుకు సత్తా.. ప్రిపరేషన్ సీక్రెట్ తెలుసా