Money Saving Tips: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీకే నష్టం.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Fixed Deposits: బ్యాంకుల్లో డబ్బులు పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సేవింగ్స్ అకౌంట్ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. రోజువారీ ఖర్చులకు ఉపయోగించుకునేందుకు సేవింగ్స్ అకౌంట్ వాడుతూ ఉంటారు. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ డబ్బులు పొదుపు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎలా చేయాలంటే..

బ్యాంకుల్లో డబ్బులు పొదుపు చేసుకునేందుకు చాలామంది ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఎఫ్‌డీ వల్ల మనం డబ్బులు పొదుపు చేసుకునే డబ్బులపై బ్యాంకులు వడ్డీ అందిస్తుంటాయి. అంతేకాకుండా మన డబ్బులను అవసరమైన సమయంలో ఎప్పుడైనా విత్ డ్రా చేసుకుని ఎఫ్‌డీ అకౌంట్ క్లోజ్ చేయవచ్చు. బ్యాంకులతో పాటు పోస్టాఫీసులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియర్ కంపెనీస్ (ఎన్‌ఎఫ్‌బీసీ)లలో కూడా ఎఫ్‌డీ చేసుకోవచ్చు. కొంతమంది ముందుచూపు లేకుండా ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. ఎఫ్‌డీ చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు అధిక ఆదాయం కూడా పొందోచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకే ఎఫ్‌డీ చేయవద్దు
మీ దగ్గర ఉన్న సొమ్మునంతా ఒకేసారి ఎఫ్‌డీ చేయవద్దు. పలు దఫాలుగా వేర్వేరు ఎఫ్‌డీలు చేయండి. ఒక ఎఫ్‌డీకి మరో ఎఫ్‌డీకి గ్యాప్ ఉండేలా చూసుకోండి. వేర్వేరు టెన్యూర్స్‌లో ఎఫ్‌డీలు చేయండి. ఒకేసారి కాకుండా టెన్యూర్స్ వేర్వేరుగా ఉండటం వల్ల మీ పెట్టుబడి ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే వేర్వేరు సమయాల్లో మెచ్యూరిటీ అవ్వడం వల్ల మీకు కూడా అవసరమైన సమయాల్లో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మీపై పెద్దగా ప్రభావం పడదు.
వడ్డీని ఇలా చేయండి
ఇక ఎఫ్‌డీ కాలవ్యవధి పూర్తయిన తర్వాత వచ్చే వడ్డీని ఖర్చు చేయకండి. ఆ డబ్బును ప్రిన్సిపల్ అమౌంట్‌తో కలిపి కొత్త ఎఫ్‌డీ వేయండి. దీని ద్వారా మీ నగదు కొన్నేళ్లల్లో మరింతగా పెరుగుతోంది. దీనినే కాంపౌడింగ్ అని పిలుస్తారు. ఇక ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సెక్షన్ 8సీ ప్రకారం ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. దీని వల్ల మీకు ట్యాక్స్ ఆదా అవుతుంది. అందుకే ఐదేళ్లు ఉండేలా చూసుకోండి.
వేర్వేరు బ్యాంకుల్లో..
ఒకే బ్యాంకులో కాకుండా వేర్వేరు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయండి. ప్రతీ బ్యాంక్ డిపాజిట్‌పై మీకు రూ.5 లక్షల బీమా కవరేజ్ లభిస్తుంది. దీని వల్ల మీ డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయి. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్న బ్యాంకులను ఎంచుకోండి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో్ ఎక్కువ వడ్డీ ఇస్తుంటేూ దానినే ఎంచుకోండి.
