Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR-Chandrababu: బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. చంద్రబాబు ఏమన్నారు.?

Jr NTR-Chandrababu: బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. చంద్రబాబు ఏమన్నారు.?

Anil kumar poka

|

Updated on: Oct 28, 2024 | 12:46 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అన్‌స్టాపబుల్‌ షోలో సందడి చేశారు. ఆహా ఓటీటీలో హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ సీజన్-4 టాక్ ప్రారంభం అయ్యింది. ఆ షోలో ఏఏ విషయాలు చెప్పారు అన్నది ఆసక్తిగా మారింది. ఇందులో బాలయ్య కొన్ని పదునైన ప్రశ్నలను చంద్రబాబుకు సంధించినట్లు తెలుస్తోంది. అవేంటో ఓసారి చూస్తే..

హైదరాబాద్‌, అమరావతిని అమితంగా ప్రేమించే చంద్రబాబుకు వైజాగ్‌ సిటీ ఫేవరెట్‌ కాదా? డెవలప్‌మెంట్‌ ముద్ర ఉన్న చంద్రబాబునాయుడు ఇష్టం లేకపోయినా 6గ్యారెంటీలు ఇచ్చారా? గెలవడానికి మాత్రమే హామీలా? వాటిని అమలుచేయడంలో ఎందుకు ఆలస్యమవుతోంది? సూపర్‌ సిక్స్‌ సీక్రెట్స్ సీఎం చంద్రబాబునాయుడు బయటపెట్టారా? వీటిని అమలు చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని బాలయ్య ముందు ఆయన అంగీకరించారా? ఇలా కొన్ని ప్రశ్నలను సూటిగా అడిగినట్లు తెలుస్తోంది.

కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సీఎం చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ప్రయారిటీ ఇస్తారా లేదా తమ పార్టీ స్వలాభాల కోసం చూసుకుంటారా? చంద్రబాబు అవకాశవాది అనేది ఆయనపై ఉన్న అపవాదా? నిజమా? జనసేనతో పొత్తు విషయంలో ఆయన స్టాండ్ ఏంటి? ఇలా అనేక ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సూటి సమాధానాలను అన్ స్టాపబుల్ షోలో చూడవచ్చు!

వీటితో పాటు మరికొన్ని ప్రశ్నలను కూడా సంధించినట్లు తెలుస్తోంది. కూటమి పాలనలో రెడ్ బుక్ పేరిట రాజ్యాంగేతరంగా వ్యవహరిస్తున్నారా? ప్రత్యర్థులను అన్యాయంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? లేదా చట్టానికి లోబడే చర్యలు తీసుకుంటున్నారా? ఈ సమాధానాలు కోసం ఆహాలో అన్ స్టాపబుల్ షో చూడాల్సిందే! భవిష్యత్తులో టీడీపీని సమర్థవంతగా నడపగల శక్తి లోకేష్ ఉందంటారా? జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఎలా స్పందించారు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉందా? తమవారిని ఒకలా, పరాయివారిని ఒకలా ట్రీట్ చేస్తున్నారా? గ్రౌండ్ లెవెల్లో జనసేన, టీడీపీ మధ్య సమన్వయ లోపం ఉందా? ప్రోటోకాల్ విషయంలో టీడీపీ నాయకులు జనసేనను తక్కువగా చూస్తున్నారా? అమరావతి అందరికి రాజధానా? లేదా సంపన్నులకు మాత్రమే రాజధానిగా మారనుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈనెల 25న ఆహాలో ప్రసారమయ్యే అన్ స్టాప్ బుల్ షోలో లభిస్తాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 28, 2024 12:31 PM