- Telugu News Photo Gallery Cinema photos I am happy in the present life, I don't need another person says Samantha, Telugu Heroine Photos
Samantha: నేను హ్యాపీగా ఉన్నా.. మరో తోడు అవసరం లేదు.. సమంత కామెంట్స్.!
నాగచైతన్య పెళ్లికి రెడీ అవుతుండటంతో సమంత గురించి కూడా డిస్కషన్ మొదలైంది. కెరీర్ పరంగా మళ్లీ బిజీ అవుతున్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయంలో ఏం ప్లాన్ చేస్తున్నారన్న క్యూరియాసిటీ అందరిలో ఉంది. తాజాగా ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు సామ్, తన పెళ్లి గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఖుషి రిలీజ్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న సమంత ప్రజెంట్ కెరీర్ మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు.
Updated on: Oct 28, 2024 | 2:22 PM

నాగచైతన్య పెళ్లికి రెడీ అవుతుండటంతో సమంత గురించి కూడా డిస్కషన్ మొదలైంది. కెరీర్ పరంగా మళ్లీ బిజీ అవుతున్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయంలో ఏం ప్లాన్ చేస్తున్నారన్న క్యూరియాసిటీ అందరిలో ఉంది.

తాజాగా ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు సామ్, తన పెళ్లి గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఖుషి రిలీజ్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న సమంత ప్రజెంట్ కెరీర్ మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు.

సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ పూర్తి చేసిన ఈ బ్యూటీ, సొంత బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నారు. అదే సమయంలో బాలీవుడ్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

ప్రజెంట్ సిటాడెల్ ప్రమోషన్‌లో ఉన్న సమంతను మళ్లీ పెళ్లెప్పుడూ అంటూ ప్రశ్నించింది మీడియా. ఈ క్వశ్చన్‌కు తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు సామ్.

'ఒకసారి ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయాను. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకోవటం గురించి ఆలోచించటం లేదు. ప్రజెంట్ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నాను.

మరో వ్యక్తి తోడు అవసరం లేదు' అన్నారు. సమంత లేటెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక పర్సనల్ లైఫ్ అనేది అవసరం లేదని చెప్పటంతో సమంత పూర్తిగా కెరీర్ మీదే ఫోకస్ చేయబోతున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.





























