- Telugu News Photo Gallery Cinema photos Hero Allu Arjun Pushpa 2 The Rule movie makers hopes on mass audience, Details Here Telugu Heroes Photos
Pushpa 2: మాస్ ఆడియన్స్ మీదే పుష్ప మేకర్స్ ఆశలు.! మరి సినీమా లవర్స్.?
ఎంత పెద్ద సినిమా అయినా భారీ వసూళ్లు సాధించాలంటే మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవ్వాలి. అందుకే స్టార్ హీరోలంతా మాస్ ఇమేజ్ కోసం కష్టాపడుతుంటారు. పాన్ ఇండియా సినిమాలు మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు నేషనల్ మార్కెట్ మీద భారీ ఆశలు పెట్టుకున్న పుష్పరాజ్ టీమ్ కూడా మాస్ ఆడియన్స్‌నే మెయిన్‌గా టార్గెట్ చేస్తోంది.
Updated on: Oct 28, 2024 | 2:04 PM

ఎంత పెద్ద సినిమా అయినా భారీ వసూళ్లు సాధించాలంటే మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవ్వాలి. అందుకే స్టార్ హీరోలంతా మాస్ ఇమేజ్ కోసం కష్టాపడుతుంటారు.

పుష్పరాజ్ మేనియా బాలీవుడ్ మేకర్స్‌ను కూడా భయపెడుతోంది. ఇంకా సీరియస్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకముందే పుష్ప 2ని చూసి నార్త్ మేకర్స్ భయపడుతున్నారు.

తొలి భాగం నార్త్‌లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద కూడా బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు పుష్ప 2 మేకర్స్.

డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమాను ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కానీ స్థాయిలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నేషనల్ లెవల్‌లో ఆరు భాషల్లో 11500 స్క్రీన్స్‌లో పుష్ప 2 రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.

అది కూడా ఎక్కువగా బీ సీ సెంటర్ల మీదే దృష్టి పెడుతున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీ కాబట్టి మాస్ ఆడియన్సే మెయిన్ ఎసెట్ అని భావిస్తున్నారు.

కొత్తగా ట్రై చేసినా.. బేస్‌ని వదలకుండా కవర్ చేయాలన్నది పుష్ప పబ్లిసిటీ స్ట్రాటజీ. అందుకే హీరో, హీరోయిన్లు ముందుండి పబ్లిసిటీ పనులు చూసుకుంటున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్ అంటున్నారు మేకర్స్. మరి రిలీజే ఈ రేంజ్‌లో ఉంటే ఇక వసూళ్లే ఇంకే స్థాయిలో ఉంటాయో ఇప్పటి నుంచి లెక్కలేసుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్.




