మీకు తెలుసా.. వంటగదిలోని ఈ మసాలా దినుసులు సహజ పెయిన్ కిల్లర్స్!
28 October 2024
TV9 Telugu
TV9 Telugu
లవంగాలు, జాపత్రి, యాలకులు, జాజికాయ, షాజీరా.. ఇలా ఎన్నో రకాల మసాలా దినుసులు ప్రతి ఇంటి వంటింట్లో కనిపిస్తాయి. ముఖ్యంగా మాంసాహారం తినే వారి వంటగదిలో ఇవి తప్పనిసరిగా ఉంటాయి
TV9 Telugu
మసాలా దినుసులకు రారాజైన మిరియాలు వేయందే ఏ వంటా పూర్తి కాదు. అయితే వంటల్లో ఉపయోగించే ఈ మసాలా దినుసులు సహజ నొప్పి నివారిణులుగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
వంటగదిలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు వంటల్లో రుచికే కాకుండా పెయిన్ కిల్లర్‌గా కూడా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలతో సహా అనేక రకాల పోషకాలు ఉంటాయి
TV9 Telugu
అలాంటి వాటిల్లో లవంగాలు ముఖ్యమైనవి. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీవైరల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. తలనొప్పి, ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం అందించడానికి లవంగాలు సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తాయి
TV9 Telugu
అలాగే అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని తీసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు
TV9 Telugu
వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పసుపులో అధికంగా ఉంటాయి. పాలలో పసుపు కలిపి తింటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నల్ల మిరియాలలో కూడా ఉంటాయి. ఇది రక్త ప్రసరణను పెంచడంతో పాటు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది
TV9 Telugu
దాల్చిన చెక్క కూడా సహజమైన నొప్పి నివారణగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి మేలు చేస్తుంది. దాల్చిన చెక్కలోని పోషకాలు నేచురల్ పెయిన్ కిల్లర్‌గా సహాయపడుతుంది