Viral: వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
అసలే వన్యమృగాలు ఆహారం దొరక్క అడవులను వదిలి జనావాసాల్లోకి వచ్చి దాడులకు పాల్పడుతుంటే కొందరు వ్యక్తులు వనాల్లోకి వెళ్లి వన్యప్రాణులతో పరాచకాలాడబోయారు. అక్కడ ఎదురైన సీన్ చూసి దెబ్బకు దిమ్మదిరిగింది ఒక్కొక్కరికీ.. దాంతో వెనక్కి తిరిగిచూడకుండా పరుగులంకించుకున్నారు. అవును, మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది.
కొందరు వ్యక్తులు సౌత్ ఫారెస్ట్ డివిజన్ రేంజ్‌లో విహారయాత్రకు వెళ్లారు. అలా వారు తమ పిక్నిక్‌ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో వారికి పొదల మాటున ఒక చిరుత పులి కనిపించింది. అంతే.. కొందరు దాంతో పరాచకాలు మొదలెట్టారు. రా.. రా.. అంటు ఆటపట్టించారు. స్వయంగా మీరే రమ్మంటే నేను రానంటానా .. అన్నట్టుగా ఒక్కసారిగా చిరుత ఆ గుంపువైపు పరిగెత్తుకు వచ్చింది. ఇంకేముంది.. చిరుత అలా తమవైపు పరుగులు పెట్టడం చూసిన గుంపు అక్కడి నుంచి పరుగందుకున్నారు. కానీ, చిరుత అక్కడ..దాని పరుగు ముందు వారెంత? అందుకే, ముగ్గురిని గాయపరిచి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
చిరుతపులి ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి, మరో వ్యక్తిని నేలపైకి లాగి, అతనిని చీల్చడానికి ప్రయత్నించింది. ఈ ఘటన షాడోల్ శ్రేణిలోని ఖితౌలీ బీట్‌లోని సోన్ నదికి సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఇదే మాదిరి పులి దాడికి సంబంధించిన ఒక సంఘటన జరిగినట్లు షాహదోల్ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. అందుకే అడవుల్లోకి ప్రజలు వెళ్లకుండా నిషేధించినట్లు చెప్పారు. ప్రజలకు సహాయపడటానికి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.