Watch: చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15  గంటలు నరకయాతన.!

Watch: చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!

Anil kumar poka

|

Updated on: Oct 28, 2024 | 12:04 PM

కల్లు గీసేందుకు ఈతచెట్టు ఎక్కి క్రిందపడిన ఓ‌ గీత కార్మికుడు నిస్సహాయ స్థితిలో రాత్రంతా నరకయాతన‌ అనుభవించాడు. దట్టమైన చెట్లపొదలు ఉండటం,ఎవ్వరూ చూడకపోవడంతో రాత్రంతా వనంలోనే ఉండిపోయాడు. ఉదయం ‌ఎనిమిది‌ గంటల‌ సమయంలో‌ అటువైపు గా వెళ్తున్న వారు‌ గమనించి నర్సయ్య గౌడ్ కుటుంబ సభ్యులకి తెలియజేసారు.

పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పెంచికల్ పేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.. ఎగోలపు‌ నర్సయ్య గౌడ్ కల్లు గీతావృత్తి చేసుకుంటూ జీవనం‌ కొనసాగిస్తున్నాడు. రోజులాగే సోమవారం కూడా కల్లు గీసేందుకి ఈతవనానికి వెళ్లాడు. చెట్టు ఎక్కి కల్లు గీసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా చెట్టుపైనుంచి జారి పడిపోయాడు. తీవ్ర గాయాలతో కదలలేని స్థితిలో నిస్సహాయంగా ఉండిపోయాడు. కనుచూపు మేర ఎవరూ లేకపోవడంతో అతను అరిచినా ఎవరికీ వినిపించక 15 గంటలపాటు నరకయాతన అనుభవిస్తూ వనంలోనే ఉండిపోయాడు. చుట్టూ‌ దట్టమైన పొదలు‌‌ ఉండడం తో నర్సయ్య గౌడ్ ని‌‌ ఎవ్వరూ చూడలేదు. దీనికి తోడు భారీ వర్షం కురవడంతో తడుస్తూ అర్తనాదాలు చేసిన రాత్రిపూట ఎవ్వరూ పట్టించుకోలేదు. ఉదయం ‌వరంగల్ ‌అసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెన్నెముక,పట్టెముకలకి బలమైన గాయాలు‌ కావడంతో‌ ప్రాణాలతో పోరాడుతున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.