OnePlus: వన్‌ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్.! ఫ్రీ గా డిస్‌ప్లే మార్చుకోవచ్చని వెల్లడి..
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల వన్ ప్లస్ యూజర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వారెంటీ కాలపరిమితి ముగిసిన వారికి కూడా డిస్‌ప్లే వారంటీ మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. కొన్ని వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్స్‌లో గ్రీన్‌లైన్ సమస్య వస్తోంది.
స్క్రీన్‌పై గ్రీన్ లైన్ సమస్య చాలా మందిని ఇబ్బందికి గురిచేస్తోంది. కొన్ని మోడల్స్ ఫోన్స్‌లో ఈ సమస్య కనిపిస్తోంది. దీంతో చాలా మంది వన్‌ప్లస్ యూజర్లు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. సోషల్ మీడియాలో వేదికగా పెద్ద ఎత్తున ఫొటోలను పోస్ట్ చేస్తూ వచ్చారు. దీనిపై తాజాగా వన్‌ప్లస్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్ లైన్ సమస్య ఉన్న ఫోన్‌కు జీవితకాల డిస్‌ప్లే వారటీని అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సమస్య ఎదుర్కొంటున్న యూజర్లు తమకు సమీపంలో ఉన్న సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలని కంపెనీ పేర్కొంది. ఎలాంటి ఛార్జిలు లేకుండా డిస్‌ప్లేను మార్చుకోవచ్చని వన్‌ప్లస్ తెలిపింది. వారెంటీ కాలపరిమితి ముగిసిన ఫోన్లకు కూడా ఈ అవకాశం వర్తిస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత ఫోన్ డిస్‌ప్లే మీద ఆకుపచ్చ రంగులో సన్నటి గీత వచ్చింది. వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్ల యూజర్లకు ఈ సమస్య ఎదురైంది. దీంతో యూజర్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఫొటోలు పోస్ట్ చేశారు. అయితే కేవలం వన్‌ప్లస్ మాత్రమే కాకుండా సామ్‌సంగ్, మోటరోలా, వివో బ్రాండ్‌లకు చెందిన కొన్ని ఫోన్‌లలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురైనట్లు వార్తలు వచ్చాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

