Water: నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే.!
అలసటగా అనిపించినా లేదా చర్మం పొడిబారినట్లు అనిపించినా.. ఎక్కువ నీళ్లు తాగాలని చెబుతూ ఉంటారు. కానీ ఈ సూచన ఎంత వరకు సరైంది? ఎవరైనా తమతో ఎప్పుడూ ఒక బాటిల్ పట్టుకుని తిరుగుతున్నారంటే, వారు శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ నీటిని తీసుకోవడం అలవాటు చేసుకుని ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం పుష్కలంగా నీరు తాగడం ఎంతో ముఖ్యం.
సోడియం అనేది ఒక కీలకమైన ఎలక్ట్రోలైట్. ఇది కణాల లోపల, వెలుపల ద్రవాల సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే కిడ్నీలు అదనపు నీటిని సమర్థవంతంగా తొలగించకపోతే మిగులు నీరు కణాల్లోకి ప్రవేశిస్తుంది. తద్వారా అవి ఉబ్బుతాయి. ఇక్కడ సోడియం నరాల సిగ్నలింగ్ , కండరాల పనితీరుకి ద్రవ సమతుల్యతకు బాధ్యత వహించే కీలకమైన ఎలక్ట్రోలైట్. తగినంత సోడియం లేకుండా శరీరం కణాల పనితీరు నిర్వహించడం కష్టమవుతుంది. ఇది ఒక్కసారిగా అనేక అవయవాలను ప్రభావితం చేస్తుంది. అలానే మూత్రపిండాలు గంటకు 0.8 నుంచి 1 లీటరు నీటిని మాత్రమే ఫిల్టర్ చేయగలవు. ఎప్పడైతే అధికంగా నీరు తీసుకుంటామో దీని వల్ల రక్తం పలచబడటానికి దారితీస్తుంది. అధికంగా నీళ్లు తాగితే..హైపోనేట్రేమియాగా పిలిచే ఇంటాక్సికేషన్ సంభవిస్తుంది. ఇది రక్తంలోని సోడియం సాంద్రతను పలుచన చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
ఫలితంగా ఎలక్ట్రోలైట్స్ పలుచబడి ద్రవాల మార్పుకి కారణమవుతుంది. ఇది సెల్యూలర్ వాపుకి కారణమై.. మెదడు వంటి ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ వాపు ఇతర భాగాల్లో అంత ప్రమాదకరం కాదు కానీ మెదడులో సంభవిస్తే ప్రాణాంతకంగా మారిపోతుంది. ఈ పరిస్థితిని సెరిబ్రల్ ఎడిమా అంటారు. ఈ పరిస్థితి రాకుండా నీటిని తాగడం తగ్గించాలి. అలాగే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరించేలా వైద్య సహాయం తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. మనం ఉంటున్న వాతావరణం, శారీరక శ్రమపై నీరు తాగడం ఆధారపడి ఉంటుంది. ఒక రోజుకు నీరు, పళ్లరసాలు, ఆహార ద్రవాలు, పానీయాలతో కలిపి పురుషులు 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్ల తీసుకోవాలి. ఇంతకు మించి తీసుకుంటే ఓవర్‌హైడ్రేషన్ సంభవించే అవకాశం ఉంది. శరీరం ఇచ్చే సంకేతాలకు అనుగుణంగా నీటిని తీసుకునే యత్నం చేయమని సూచిస్తున్నారు. అలాగే వ్యాయామాలు చేసేవారు, వేడి లేదా పొడి వాతావరణంలో ఉన్నవారు ద్రవ నష్టాన్ని భర్తీ చేసుకునేలా అధిక నీరు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.