AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omega-3 fatty acids: సడెన్ కార్డియాక్ డెత్ రిస్క్ తగ్గించే చేపలు.. వారానికి 2 సార్లైనా తినాల్సిందే

వయసుతో సంబంధం లేకుండా నేటి కాలంలో పిల్లల నుంచి యువత వరకు ప్రతి ఒక్కరూ గుండె జబ్బులతో క్షణాల్లో మృత్యువాత పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే చేపలను ఆహారంలో అధికంగా తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..

Srilakshmi C
|

Updated on: Oct 28, 2024 | 12:29 PM

Share
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ చేపల్లో అధికంగా ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ధమనులలో ఫలకం పెరుగుదలను తగ్గిస్తుంది.

1 / 5
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారానికి కనీసం రెండుసార్లు ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన చేపలను తినాలని సిఫార్సు చేస్తోంది. అన్ని చేపలు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలాలు. చేపలలోని ఒమేగా-3, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా గుండె జబ్బులతో మరణించే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

2 / 5
వారానికి కనీసం రెండుసార్లు చేపలు తినడానికి ప్రయత్నించాలి. ఇటువంటి చేపలలో ముఖ్యంగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఆకస్మిక కార్డియాక్ డెత్ రిస్క్ తగ్గుతుంది.

3 / 5
అనేక రకాల సీఫుడ్‌లలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు తక్కువ మొత్తంలో ఉంటాయి. కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి.

4 / 5
చేపల వినియోగం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొంతమందికి చేపలు తిన్న తర్వాత అలెర్జీలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి చేపలను ఎక్కువగా తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

5 / 5