AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love: మీ ప్రేయసితో పొరపాటున కూడా ఈ విషయాలు చెప్పకండి.. చెప్పారో ఇక బ్రేకప్ అయిపోతుంది..

ప్రేమ (Love) అనేది రెండు మనసుల కలయిక. రెండు గుండెల చప్పుడు.. ఇరువురి మధ్య ఎలాంటి అపార్థాలకు తావు లేకుండా ఎంతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు.

Love: మీ ప్రేయసితో పొరపాటున కూడా ఈ విషయాలు చెప్పకండి.. చెప్పారో ఇక బ్రేకప్ అయిపోతుంది..
Love Breakup
Rajitha Chanti
|

Updated on: Apr 14, 2022 | 10:00 AM

Share

ప్రేమ (Love) అనేది రెండు మనసుల కలయిక. రెండు గుండెల చప్పుడు.. ఇరువురి మధ్య ఎలాంటి అపార్థాలకు తావు లేకుండా ఎంతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే అమ్మాయిలు.. అబ్బాయిలు.. తమ వ్యక్తిగత జీవితంలోని ప్రతి విషయాన్ని తమ భాగస్వామితో షేర్ చేసుకుంటారు. ఇక ప్రేమలో ఉన్నప్పుడు ఒకరి గురించి మరొకరి పూర్తిగా తెలుసుకుని.. వారి ఇష్టాలను గౌరవిస్తుంటారు. తమ జీవితంలో జరిగినవి.. జరుగుతున్న పరిస్థుతులను.. తమ ఆలోచనలను తన ప్రియుడితో.. లేదా ప్రియురాలితో పంచుకుని ఆనందపడుతుంటారు. అయితే కొన్నిసార్లు ప్రియుడు.. ప్రియురాలు చెప్పే విషయాలు వారి సంబంధంలో మనస్పర్థలకు దారితీసే అవకాశం ఉంటుంది. తమ మనసులోని భావాలను తెలియజేయడం వలన మీ భాగస్వామి బాధపడే అవకాశం ఉంది. సంతోషం, దుఃఖంలో మీ భాగస్వామికి తోడుగా ఉండడం వలన మీరు వారికి ధైర్యాన్ని ఇచ్చినట్లుగా ఉంటారు.. వారి పట్ల ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకోవడం.. వారితో నిజాయితీగా ఉండడం వలన వారిద్దరి మధ్య ప్రేమ మరింత బలంగా ఉంటుంది. అయితే కొందరు అబ్బాయిలు తమ ప్రేయిసితో కొన్ని విషయాలను చెప్పడం వలన వారి ప్రేమ విడిపోయే అవకాశం ఉంది. పొరపాటున కొన్ని విషయాలను పంచుకోవడం వలన మీ ప్రేయసికి కోపం వచ్చి బ్రేకప్ జరిగే అవకాశం ఉంది. అవెంటో తెలుసుకుందామా.

మీ మాజీ ప్రేయసి గురించి చెప్పడం.. సాధారణంగా అబ్బాయిలు తమ మాజీ ప్రేయసి గురించి ప్రస్తుత ప్రియురాలి దగ్గర చెప్పేస్తుంటారు. దీంతో మీ ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ అసూయ పడి అలిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఇదే విషయంపై మీ మద్య గొడవ జరుగుతుంది. అయితే మీ మాజీ ప్రేయసి గురించి చెప్పడంలో తప్పులేదు.. కానీ.. ప్రతి చిన్న విషయాన్ని పదే పదే చెప్పడం వలన ప్రస్తుత బంధం విడిపోయే అవకాశం ఉంది.

ఇతర అమ్మాయిలను పొగడడం.. ప్రతి అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తనను మాత్రమే మెచ్చుకోవాలని కోరుకుంటుంది. తన ప్రియుడు తనపై మాత్రమే శ్రద్ద చూపాలని అనుకుంటుంది. ఆమె ముందు ఇతర అమ్మాయి గురించి మాట్లాడడం.. వారిని పొగడడం చేస్తే ఇక మీ మధ్య గొడవ ప్రారంభమవుతుంది. మీపై అమ్మాయికి అభద్రతా భావం కలుగుతుంది. ఎలాంటి పరిస్థితులలోనైనా ఇతర అమ్మాయిల గురించి తరచూ మాట్లాడడం.. పొగడడం చేస్తే మీ నుంచి విడిపోవాలని కోరుకుంటారు. అందుకే ఈ పొరపాటు చేయకండి.

పదే పదే బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పడం.. మీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే ఉండవచ్చు. కానీ మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్, ఇతర విషయాల గురించి మీ ప్రియురాలికి ప్రతిసారి చెప్పడం వలన వారు విసుగు చెందుతారు. వారికి ఈ విషయాలను వినడం అస్సలు ఇష్టముండదు.. ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలు తమ జీవిత భాగస్వాములు వారి కాళ్ళపై నిలబడుతున్నారు వారు తమ అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడరు అని విశ్వసిస్తున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో అబ్బాయిలు డబ్బు గురించి పదే పదే మాట్లాడితే గర్ల్‌ఫ్రెండ్‌కి మీపై నమ్మకం పోతుంది.

దుస్తుల గురించి మాట్లాడటం.. కొంతమంది అబ్బాయిలకు ప్రతిసారీ ప్రియురాలి దుస్తులపై అవహేళన చేయడం అలవాటు ఉంటుంది. ఒక్కోసారి తను ఏ రంగు వేసుకుందో చెప్తే మరి కొన్ని సార్లు ఏ డిజైన్ డ్రెస్ వేసుకుందో చెబుతుంటారు. దీంతో మీరు ప్రతిసారీ ఆమె దుస్తులపై మాట్లాడటం.. అవహేళన చేయడం వలన ఆమె బాధపడుతుంది. అందుకే అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడకపోవడమే మంచిది. కానీ మీ ప్రేయసికి ఏ రంగు దుస్తులు బాగుంటాయి.. ఏ డిజైన్ బాగుంటుందని సలహాలు ఇవ్వడం వలన ఆమె సంతోషిస్తుంది. మీరు ఎంపిక చేసిన దుస్తులను ఆమె ఇష్టపడుతుంది. కానీ అవహేళన చేయడం వలన మీ బంధం విడిపోయే అవకాశం ఉంటుంది.

ఇతరులతో పోల్చడం.. ఈ విషయం అందరికీ వర్తి్స్తుంది. ఒక స్త్రీని మరో స్త్రీతో పోలిస్తే వారు అస్సలు ఇష్టపడరు. సాధారణంగా అమ్మాయిలు స్వాతంత్రంగా ఉండటానికి.. వారిని వారు ఎవరితో పోల్చుకోకుండా.. ప్రత్యేకంగా ఉండేందుకు ఇష్టపడతారు. అలాంటి సమయంలో మీరు మీ ప్రేయసిని ఇతరులతో పోలిస్తే ఆమె ఇష్టపడదు. ప్రస్తుత కాలంలో అమ్మాయిలు ఎప్పుడూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇతర అమ్మాయిలతో మీ ప్రేయసిని పోలిస్తే మాత్రం మీ బంధం బ్రేకప్ జరిగే అవకాశాలు ఎక్కువే ఉంటాయి.

గమనిక:- ఈ కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.

Also Read: Gentleman 2 : జెంటిల్‌మేన్ 2లో మరో హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్.. ఎవరంటే..

James: ఓటీటీలో సందడి చేయనున్న మరో రెండు సూపర్ హిట్స్.. పునీత్ చివరి మూవీతోపాటు..

KGF 2 Twitter Review: కేజీఎఫ్ 2 ట్విట్టర్ రివ్యూ..  సినిమా ఎలా ఉందంటే..

Sonu Sood: నా భార్య రక్తం తాగుతోందని నెటిజన్‌ ట్వీట్‌.. సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?