AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఓర్నాయనో.. ఈ అలవాట్లు ఉంటే ఇక అంతే సంగతులు.. మీ ఆయుష్షు తగ్గడానికి కారణమిదేనంట..

ఒకప్పుడు 100, 110 ఏళ్లు బతికే జనాలు ఇప్పుడు 60, 70 ఏళ్లకే తనువు చాలిస్తున్నారు. ఇందుకు ప్రదాన కారణం..మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు, పనిఒత్తిడి..వీటన్నింటి కారణంగా జనాలు 30 ఏళ్లకే అరోగ్య సమసల భారిన పడుతున్నారు. ఇవేకాకుండా ఇంకా చాలా అలవాట్లు మన ఆయుష్షును తగ్గిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: ఓర్నాయనో.. ఈ అలవాట్లు ఉంటే ఇక అంతే సంగతులు.. మీ ఆయుష్షు తగ్గడానికి కారణమిదేనంట..
Indian Lifespan
Anand T
|

Updated on: Oct 02, 2025 | 6:06 PM

Share

ప్రస్తుత ప్రపంచ ఆరోగ్య గణాంకాల ప్రకారం..ఒక భారతీయుడి ఆయుర్దాయం దాదాపు 72 సంవత్సరాలు..అదే జపాన్‌లో 85 సంవత్సరాలు. అంటే రెండు దేశాల ప్రజల ఆయుర్దాయం మధ్య దాదాపు 13 సంవత్సరాల తేడా ఉంది. దీనికి కారణంగా జన్యుపరమైన సమస్యలని చాలా మంది అనుకుంటారు..కానీ వాస్తవానికి ఇది కారణం కాదు. భారతీయుల ఆయుర్దాయం తగ్గడానికి ప్రధాన కారణం వారి జీవనశైలి, ఆహారు అలవాట్లు. మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న తప్పులు మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. అవేంటో అక్కడ తెలుసుకుందాం

మన ఆయుష్షును తగ్గించే అలవాట్లు ఇవే..

ఆహారపు అలవాట్లు: మనం ఆయుష్యు తగ్గడానికి ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమే.. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం అనేది మనశరీర భాగాల పనితీరును ప్రభావింతం చేస్తుంది. వంటలో మనం నూనె, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉపయోగిస్తాము. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని కూడా తింటాము. దీనివల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్లు తగ్గుతాయి. ఫలితంగా, బరువు పెరగడం, డయాబెటిస్, బిపి, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తాయి. అయితే, జపనీయులు తేలికైన,సమతుల్య ఆహారం తీసుకుంటారు. కాబట్టి వారు ఎక్కువకాలం జీవిస్తారు.

వ్యాయామం చేయకపోవడం:మన ఆయుష్షు తగ్గడానికి ప్రధాన కారణం వ్యాయామం, వాంకింగ్ వంటి శారీరక శ్రమ కలిగిన పనులు చేయకపోవడం. దీనితో పాటు ఎక్కువసేపు కూర్చొని ఉండే పనులు చేయడం.అయితే, జపాన్‌లో మాత్రం వ్యాయామం వారి జీవితంలో ఒక భాగం. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు వేల అడుగులు నడుస్తారు. వ్యాయామం చేస్తారు. కానీ మనం ఎక్కువ సమయం కుర్చీలో కూర్చునే గడుపుతాము.

విశ్రాంతి లేకపోవడం:మన ఆయుష్షు తగ్గడానికి మరో కారణం.. అధికపని గంటలు. భారతీయులు ఎక్కువ గంటలు పని చేస్తారు..అలాగే తక్కువ విశ్రాంతి తీసుకుంటారు.ఇది వారి శారీరక, మానసిక అలసట, ఎక్కువ ఒత్తిడికి దారితీస్తుంది. దీని ఫలితంగా గుండె జబ్బులు,నిరాశ, నిద్ర సమస్యలు వస్తాయి.రాత్రి ఆలస్యంగా తినే అలవాటు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

నిద్రలేకపోవడం: మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే ముఖ్యం. జపనీయులు కనీసం 7 గంటలు నిద్రపోతారు.కానీ భారతీయులు మాత్రం పని ఒత్తిడి , ఫోన్స్‌ వాడకం కారణంగా 5 నుంచి 6 గంటలు మాత్రమే నిద్రపోతారు. దీని వలన రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే, చాలామంది రోజూ వ్యాయామం చేయరు. కొంతమంది మాత్రమే జిమ్‌కు వెళతారు, మిగిలిన వారు వ్యాయామాన్ని పూర్తిగా మానేస్తున్నారు.

పైన చెప్పిన ఇలాంటి అలవాట్లు మన ఆయుష్షును త్వరగా తగ్గిస్తాయి. కానీ మనం నిరాశచెందాల్సిన అవసరం లేదు. మన దైనందిన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే,ఈ సమస్యను మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఆహారంలో ప్రోటీన్, కూరగాయలు తీసుకోండి. అలాగే ప్రతిరోజూ కనీసం 7-8 వేల అడుగులు నడండి తక్కువ నూనె వాడండి.ఒత్తిడిని తగ్గించుకోండి.ధ్యానం, యోగా సాధన చేయడం వంటివి అలవాటు చేసుకోండి.

ఆయుష్షు అనేది అదృష్టం మీద ఆధారపడి ఉండదు, మనం అనుసరించే జీవనశైలి,అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.మనం లైఫ్‌లో మనం సరైన నిర్ణయాలు తీసుకుంటే, జపనీయుల మాదిరిగానే కాదు..వారికన్న 2 ఏళ్లు ఎక్కువనే బతకగలం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.