Apple Peels: యాపిల్ తొక్కలను పడేస్తున్నారా ?.. ముఖంపై మచ్చలను తొలగించడంలో బెస్ట్.. ఎలా ట్రై చేయాలంటే..
చర్మ సమస్యలతో ఇబ్బందిపడేవారికి ఈ యాపిల్ తొక్కలు అనేక విధాలుగా ఉపయోగపడతాయి.
యాపిల్ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. రోజుకు ఒక్క యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అంటారు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా… అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ సహయపడుతుంది.అయితే చాలా మంది యాపిల్ తొక్కలను తినకుండా బయటపడేస్తుంటారు. కానీ యాపిల్ తొక్కలు వేసవిలో అనేక ప్రయోజనాలను కలిగిస్తాయనే అనే విషయం తెలుసా?. చర్మ సమస్యలతో ఇబ్బందిపడేవారికి ఈ యాపిల్ తొక్కలు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే.. ఇందులో ఉండే.. విటమిన్ కె, ఇ చర్మానికి మేలు చేస్తాయి. యాపిల్ తొక్కల వలన చర్మానికి కలిగే ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందామా..
* వేసవిలో చర్మం తేమ తక్కువగా ఉండటం వల్ల పొడిగా ఉంటుంది. చర్మాన్ని పొడి బారకుండా ఉండేందుకు యాపిల్ తొక్కలు ఉపయోగపడతాయి. యాపిల్ తొక్కలు.. టొమాటోను గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి.. అందులో కాస్త పెరుగు వేసి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి. * యాపిల్ తొక్కలతో చేసిన పౌడర్‌లో ఫ్రెష్ బటర్ మిక్స్ చేసి ముఖానికి, మెడకు బాగా పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి మూడుసార్లు చేయండి వల్ల ముఖం సహజంగా మెరుస్తుంది. అంతేకాకుండా.. ముఖం నిర్జీవంగా మారకుండా ఎల్లప్పుడు నిగారింపుగా ఉంచడంలోనూ యాపిల్ తొక్కలు ఉపయోగపడతాయి.
గమనిక:- ఈ కథనం కేవలం చర్మ నిపుణుల సూచనలు.. నివేదికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.. అమలు చేసే ముందు వైద్యులను సంప్రదించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Tina Sadhu: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆట డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతి
Sarkaru Vaari Paata: బాక్సాఫీస్ లెక్క వేరు.. ఇక్కడ లెక్కలు ఇంకో తీరు..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్
MS Dhoni: సరికొత్త ఇన్సింగ్స్ స్టార్ట్ చేయనున్న ధోని.. నయనతార సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ..
RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..