Lemon Peel: రసం పిండేసి నిమ్మ తొక్క పడేస్తున్నారా..? అయితే లెక్కలేనన్ని ప్రయోజనాలు మిస్ అవుతున్నారు

నిమ్మతొక్కలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి. అయితే నిమ్మతొక్కలు కాస్త చేదుగా ఉంటాయి. కనుక వాటిని నేరుగా తినలేరు. అప్పుడు నిమ్మ తొక్కలను ఎండ బెట్టి పొడి చేసి ఉపయోగించుకోవచ్చు.

Lemon Peel: రసం పిండేసి నిమ్మ తొక్క పడేస్తున్నారా..? అయితే లెక్కలేనన్ని ప్రయోజనాలు మిస్ అవుతున్నారు
Lemon Peel Benefits
Follow us
Surya Kala

|

Updated on: May 12, 2022 | 8:22 PM

Lemon Peel: నిమ్మకాయలు, ఆకులు, పువ్వుల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. నిమ్మరసం ఆరోగ్య ప్రయోజ‌నాలను ఇస్తుందన్న సంగతి తెలిసిందే.. అయితే నిమ్మకాయను అనేక రకాలుగా ఉపయోగిస్తాం.. అనంతరం వాటి తొక్కలను పడేస్తాం.. కానీ నిమ్మతొక్కలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి. అయితే నిమ్మతొక్కలు కాస్త చేదుగా ఉంటాయి. కనుక వాటిని నేరుగా తినలేరు. అప్పుడు నిమ్మ తొక్కలను ఎండ బెట్టి పొడి చేసి ఉపయోగించుకోవచ్చు. నిమ్మతొక్కల పొడిని ఆహార పదార్ధాల్లో కానీ, జ్యూస్(Lemon Juice) రూపంలో తీసుకుంటారు. నిమ్మ తొక్కల‌ను టీ(Lemon Tea) గా కూడా చేసుకుని తాగుతారు. ఈరోజు నిమ్మతొక్కల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

  1. నిమ్మ తొక్కల్లో నిమ్మర‌సం కంటే కూడా అధికంగా పోషకాలను అందిస్తుంది. ఇక విట‌మిన్ సి,  విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, డి-లైమోనీన్‌, బీటా కెరోటిన్, సిట్రిక్ యాసిడ్‌, మాలిక్ యాసిడ్‌, హెస్పెరిడిన్ వంటి అనేక పోషకాలున్నాయి. నిమ్మతొక్కల్లో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం కూడా అధికమే..
  2. నిమ్మతొక్కల్లో ఉండే పొటాషియం హైబీపీని త‌గ్గిస్తుంది. ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో గుండె జ‌బ్బులను నివారిస్తుంది.
  3. నిమ్మకాయ‌లకు సువాసన ఇచ్చే.. డి-లైమోనీన్ సమ్మేళనం.. యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. దీనివలన రోగ నిరోధక శక్తినిస్తుంది.
  4. ఇక నిమ్మ తొక్కల పొడిలో క్యాన్సర్ క‌ణాలను నాశనం చేసే గుణాలున్నాయి. అంతేకాదు డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులను నివారిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. నిమ్మతొక్కలు డి-లైమోనీన్ శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక ఫ్రీ ర్యాడిక‌ల్స్ నాశ‌నం అవుతాయి. దీంతో వాపులు తగ్గుతాయి.
  7. తెల్ల రక్త కణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నవారికి దివ్య ఔషధం నిమ్మతొక్కలు. నిమ్మతొక్కల్లో ఉండే విట‌మిన్ సి శ‌రీరంలో యాంటీ బాడీల‌ను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.
  8. కనుక ఎన్నో నిమ్మకాయను ఏమాత్రం తీసిపోని విధంగా ఆరోగ్య ప్రయోనాలు ఇచ్చే నిమ్మతొక్కలను ఇక నుంచి పడేయకండి.. వాటిని ఎండబెట్టి.. పొడిని విరివిగా తీసుకోండి.. ఆరోగ్యంగా జీవించండి..

ఇక్కడ ఇచ్చిన సూచనలు.. అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్