Watermelon: షుగర్ పేషెంట్స్ పుచ్చకాయ తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారు
సమ్మర్‌లో కచ్చితంగా కనిపించే వాటిలో పుచ్చకాయ ప్రధానమైంది. దాదాపు 90 శాతం నీటి కంటెంట్ ఉండే పుచ్చకాయను సమ్మర్‌లో చాలా మంది ఇష్టపడి తింటుంటారు. ఇక ఇందులో పోషక విలువలు సైతం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇదిలా ఉంటే షుగర్‌తో బాధపడే వారు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారని...

సమ్మర్‌లో కచ్చితంగా కనిపించే వాటిలో పుచ్చకాయ ప్రధానమైంది. దాదాపు 90 శాతం నీటి కంటెంట్ ఉండే పుచ్చకాయను సమ్మర్‌లో చాలా మంది ఇష్టపడి తింటుంటారు. ఇక ఇందులో పోషక విలువలు సైతం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇదిలా ఉంటే షుగర్‌తో బాధపడే వారు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారని తెలిసిందే. ఏ ఆహారాన్ని తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు. మరి ఆరోగ్యానికి మేలు చేసే పుచ్చకాయ షుగర్ షేషెంట్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
డీహైడ్రేషన్ సమస్య బారినపడకుండా ఆరోగ్యాన్ని రక్షించే పుచ్చకాయ షుగర్ పేషెంట్స్‌కి మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వాటర్ మిలాన్ తీసుకోవడం రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో సహజంగా ఉండే షుగర్ ఫ్రక్టోజ్ మదుమేహాన్ని పెంచే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అందుకే షుగర్ పేషెంట్స్ వీలైనంత వరకు పుచ్చకాయకు దూరంగా ఉండాలని అంటున్నారు.
నిపుణులు అభిప్రాయం ప్రకారం 152 గ్రాముల పుచ్చకాయలో 9.42 గ్రాముల నేచురల్ షుగర్ ఉంటుంది. 11.5 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటుంది. పుచ్చకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది సాధారణంగా 72 ఉంటుంది. కానీ ప్రతి 120 గ్రాముల పుచ్చకాయలో గ్లైసెమిక్స ఇండెక్స్ 5 ఉంటుంది. అందుకే ఇది షుగర్ లెవల్స్ పెరగడానికి కారణంగా మారుతుందని అంటున్నారు.
అయితే అతిగా కాకుండా అప్పుడప్పుడు అదికూడా కొద్ది మొత్తంలో తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. పుచ్చకాయను పరిమితంగా తీసుకుంటే షుగర్ పేషెంట్స్‌కి కూడా మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ముందుగా వైద్యుల సూచన మేరకు తినడమే బెస్ట్ అని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




