AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foods for Waist: నడుము నాజూకుగా తీగలా ఉండాలా.. ఈ ఫుడ్స్ బెస్ట్..

ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ముఖ్యంగా నడుము, పొట్ట భాగాల్లో కొవ్వు అనేది బాగా పేరుకుపోతుంది. వీటికి ముఖ్య కారణం సరైన జీవన విధానాన్ని అలవరచుకోక పోవడమే అని నిపుణులు అంటున్నారు. అయితే కొందరిలో మాత్రం శరీరం అంతా సాధారణంగా ఉన్నా.. నడుము భాగంలో మాత్రం కొవ్వు పేరుకు పోయి.. లావుగా కనిపిస్తుంది. అలాంటి వారు నడుము కొలతను తగ్గించుకోవడానికి..

Foods for Waist: నడుము నాజూకుగా తీగలా ఉండాలా.. ఈ ఫుడ్స్ బెస్ట్..
Foods For Waist
Chinni Enni
|

Updated on: May 03, 2024 | 3:13 PM

Share

ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ముఖ్యంగా నడుము, పొట్ట భాగాల్లో కొవ్వు అనేది బాగా పేరుకుపోతుంది. వీటికి ముఖ్య కారణం సరైన జీవన విధానాన్ని అలవరచుకోక పోవడమే అని నిపుణులు అంటున్నారు. అయితే కొందరిలో మాత్రం శరీరం అంతా సాధారణంగా ఉన్నా.. నడుము భాగంలో మాత్రం కొవ్వు పేరుకు పోయి.. లావుగా కనిపిస్తుంది. అలాంటి వారు నడుము కొలతను తగ్గించుకోవడానికి మీ లైఫ్‌ స్టైల్, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అలాగే తగిన వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి. ఇలా అయితే మీకు చక్కని రూపం వస్తుంది. అలాగే మీరు కూడా ఫిట్‌గా ఉంటారు. మీ వెయిస్ట్ సైజ్‌ని తగ్గించడంలో నట్స్ అనేవి చక్కగా ఉపయోగ పడతాయి. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాల్ నట్స్:

చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే.. నట్స్ తింటే బరువు పెరుగుతారు అనుకుంటారు. కానీ వీటిల్లో మంచి ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వీటిని సరిగ్గా వాడితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. వాల్ నట్స్‌లో ఓమేగా 3 ఫ్ాయటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని మితంగా తీసుకుంటే.. మీ నడుము సైజును తగ్గడమే కాకుండా.. వెయిట్ లాస్ కూడా అవుతారు.

జీడిపప్పు:

జీడిపప్పును తీసుకోవడం వల్ల కూడా మీ నడుము చుట్టుకొలతను తగ్గించుకోవచ్చు. ఇందులో కూడా మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్ లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి అనేది తగ్గుతుంది. జీడిపప్పును చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పిస్తా పప్పు:

పిస్తా పప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో క్యాలరీలు అనేవి తక్కువగా ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, అవేవి ఉంటాయి. కాబట్టి పిస్తా కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. మీరు వీటిని అప్పుడప్పుడూ చిరు తిండిలా తీసుకోవచ్చు. వీటితో మీ నడుము సన్నగా తయారవుతుంది.

బ్రెజిల్ గింజలు:

బ్రెజిల్ గింజలు కూడా వెయిట్ లాస్ అవ్వడంలో చక్కగా హెల్ప్ చేస్తాయి. వీటిల్లో కూడా గుడ్ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోలీన్, సెలీనియం వంటివి ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగు పరిచి.. మీ నడుము సన్నగా అయ్యేందుకు సహాయ పడతాయి.

NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు