AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mouth Cancer: గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో అనారోగ్య సమస్యలు సర్వసాధారణమై పోయాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి తమ ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో ఉన్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ వచ్చిందంటే బ్రతకడం చాలా కష్టం. క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. అందులో నోటి క్యాన్సర్ కూడా ఒకటి. నోటి క్యాన్సర్ అనేది ధూమపానం వల్ల వస్తుంది. నోటి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే..

Mouth Cancer: గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
Mouth Cancer
Chinni Enni
|

Updated on: May 03, 2024 | 3:40 PM

Share

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో అనారోగ్య సమస్యలు సర్వసాధారణమై పోయాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి తమ ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో ఉన్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ వచ్చిందంటే బ్రతకడం చాలా కష్టం. క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. అందులో నోటి క్యాన్సర్ కూడా ఒకటి. నోటి క్యాన్సర్ అనేది ధూమపానం వల్ల వస్తుంది. నోటి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే.. ప్రాణాపాయ స్థితి నుండి బయట పడొచ్చు. కొన్ని లక్షణాల ద్వారా ప్రారంభ దశలో ఉండే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. దీంతో చికిత్స తీసుకోవడం కూడా సులభతరం అవుతుంది. మరి నోటి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గొంతులో నిరంతరం నొప్పి, చికాకు, నోరు మందంగా ఉండటం. ఈ లక్షణాలు నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలుగా చెప్పొచ్చు. అలాగే ఏదైనా తాగినా, తిన్నా కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది.

2. నోటి లోపల తెల్లటి మచ్చలు లేదా ఎరుపు రంగులో ఉండే మచ్చలు కనిపిస్తాయి. ఇవి రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటే.. డాక్టర్ని సంప్రదించడం మేలు.

ఇవి కూడా చదవండి

3. అంతే కాకుండా గొంతులో ఎప్పుడూ ఏదో ఇరుక్కున్నట్టు ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఆహారం మింగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని డైస్పాగియా అంటారు. ఈ లక్షణం కూడా నోటి క్యాన్సర్‌కు సంకేతంగా చెప్పొచ్చు.

4. మాట్లాడినప్పుడు కరకరలాడే శబ్ధం రావడం, గొంతు బొంగురు పోవడం వంటి లక్షణాలు ఎక్కువ కాలం ఉంటే క్యాన్సర్ కిందకే వస్తాయి.

5. అదే విధంగా దగ్గును కూడా నోటి క్యాన్సర్‌కు ఒక లక్షణంగా చెప్తాపరు. ఈ దగ్గు అనేది ఎక్కువ కాలం ఉండటం వల్ల ప్రమాదమే.

6. నోరు, పెదవులు, నాలుక వంటి భాగాలు ఎక్కువగా తిమ్మిరి పట్టినట్టుగా, జలదరించినట్లుగా ఉన్నా.. నోటి క్యాన్సర్‌కు లక్షణంగా చె్పొచ్చు.

7. నోటి క్యాన్సర్‌తో బాధ పడేవారిలో మాట్లాడటం, మింగడం, నమలడం కూడా చాలా కష్టంగా ఉంటుంది.

పైన చెప్పిన లక్షణాలు సాధారణంగా అప్పుడప్పుడూ ఉంటాయి. అయితే అవి ఎక్కువ కాలం ఉంటే మాత్రం ప్రమాదంగా గుర్తించాలి. వెంటనే సంబంధిత వైద్యుల్ని సంప్రదించడం మేలు.

NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..