Heart Health: గుండెపోటు ముప్పు తప్పించుకోవాలా? వంటింట్లో ఉండే ఈ విత్తనాలే మీకు శ్రీరామరక్ష!
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక కొలెస్ట్రాల్. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి వంటింట్లో ఉండే కొన్ని గింజలు అద్భుతంగా పని చేస్తాయి. ప్రకృతి ప్రసాదించిన ఔషధాలు.. రక్తం గడ్డకట్టడం, ఊబకాయం వంటి సమస్యలకు ప్రధాన కారణం శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్. ఖరీదైన మందుల కన్నా రోజువారీ ఆహారంలో కొన్ని రకాల విత్తనాలను చేర్చుకోవడం వల్ల సహజంగానే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైంది. నూనె వస్తువులు అతిగా తినడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం వంటి అలవాట్లు ఇందుకు కారణమవుతున్నాయి. చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఆహార నియమాలు పాటిస్తూ, కొన్ని రకాల గింజలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అదుపు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కొలెస్ట్రాల్ తగ్గించే గింజలు:
అవిసె గింజలు (Flax Seeds)
గుమ్మడి గింజలు (Pumpkin Seeds)
పొద్దుతిరుగుడు గింజలు (Sunflower Seeds)
నువ్వులు (Sesame Seeds)
చియా విత్తనాలు (Chia Seeds)
మెంతులు (Fenugreek)
కాలోంజి విత్తనాలు (Kalonji)
జనపనార విత్తనాలు (Hemp Seeds)
ప్రయోజనాలు ఇవే: అవిసె గింజల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలోని చెడు కొవ్వును తగ్గిస్తాయి. మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉండే గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పొద్దుతిరుగుడు గింజల్లోని ఫైటోస్టెరాల్స్ వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
నువ్వులను నిత్యం తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. చియా విత్తనాల్లోని పీచు పదార్థం కొవ్వును తొలగించడంలో తోడ్పడుతుంది. మెంతుల్లో ఉండే సపోనిన్లు అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. కాలోంజి విత్తనాల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు శరీర వాపులను తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
గమనిక: ఈ విత్తనాలను ఆహారంలో భాగంగా తీసుకుంటూనే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆశించిన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. ఏదైనా అనారోగ్యం ఉన్నవారు వైద్యుల సలహాతో వీటిని తీసుకోవడం ఉత్తమం.యామం చేయడం వల్ల ఆశించిన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. ఏదైనా అనారోగ్యం ఉన్నవారు వైద్యుల సలహాతో వీటిని తీసుకోవడం ఉత్తమం.




