AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ.. మీరసలు మనుషులేనా..! వరుసకు సోదరితోనే యవ్వారం.. విషయం బయటపడటంతో..!

సభ్య సమాజం సిగ్గు పడే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వావివరసలు మరిచి పెట్టుకున్న వివాహేతర సంబంధాలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. వరుసకు సోదరి అయ్యే మహిళతో ఓ యువకుడు అనైతిక బంధాన్ని కొనసాగించాడు. చివరికి ప్రాణాలనే కోల్పోయాడు. తన భార్యతో వివాహేతర బంధం పెట్టుకున్న యువకుడిని ఓ భర్త కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఛీ.. ఛీ.. మీరసలు మనుషులేనా..! వరుసకు సోదరితోనే యవ్వారం.. విషయం బయటపడటంతో..!
Illegal Affair (representative image)
M Revan Reddy
| Edited By: |

Updated on: Dec 18, 2025 | 5:28 PM

Share

సభ్య సమాజం సిగ్గు పడే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వావివరసలు మరిచి పెట్టుకున్న వివాహేతర సంబంధాలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. వరుసకు సోదరి అయ్యే మహిళతో ఓ యువకుడు అనైతిక బంధాన్ని కొనసాగించాడు. చివరికి ప్రాణాలనే కోల్పోయాడు. తన భార్యతో వివాహేతర బంధం పెట్టుకున్న యువకుడిని ఓ భర్త కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

యాదాద్రి జిల్లా గుండాల మండలం బుర్జుబావికి చెందిన మహిళతో పదేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేశ్యగిరి గ్రామానికి చెందిన ఏనుగుల బాలనర్సయ్యకు వివాహమైంది. బాల నరసయ్య జీవనోపాధికి హైదరాబాద్ వెళ్లి భార్యతో కలిసి జవహర్‌నగర్‌లో ఉంటూ టైల్స్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుర్జుబావికి చెందిన గడ్డం దావీద్ జులాయిగా తిరిగేవాడు. వరుసకు సోదరి అయిన బాలనర్సయ్య భార్యతో ఉన్న బంధానికే మచ్చ తీసుకువచ్చాడు. వీరిద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగుతున్న విషయం తెలుసుకున్న బాల నరసయ్య.. భార్యను తీవ్రంగా మందలించాడు. బంధువులు కూడా చెప్పారు..

అయినా ఆమె నడవడికలో మార్పు రాలేదు. దావీదుతో కలిసి ఆమె కొద్ది రోజులపాటు వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. భర్త, కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పి, తిరిగి బుర్జుబావికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో బాలనర్సయ్య కూడా తన అత్తగారి ఊరైన బూర్జుబావిలోనే ఉంటూ కూలీ పనులకు వెళ్తున్నాడు. దావీదు మాత్రం స్వగ్రామానికి రాకుండా ఉంటున్నాడు.

అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు దావీదు స్వగ్రామానికి వచ్చాడని బాలనరసయ్య తెలుసుకున్నాడు. దావీదును తీసుకుని బాలనరసయ్య తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అక్కడ ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో రగలిపోయిన బాలనర్సయ్య దావీదుపై దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. దీంతో కింద పడిపోయిన దావీదును కర్రలతో బాలనరసయ్య, మహిళా సోదరుడు వంశీలు విచక్షణారహితంగా కొట్టడంతో దావీదు మృతిచెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు గుండాల ఎస్సై తేజంరెడ్డి తెలిపారు. దావీదు హత్యకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..