AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మకానికి సంక్రాంతి పందెం కోళ్లు.. సోషల్ మీడియాను ఇలా కూడా వాడేస్తున్నారా..?

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ కోళ్ల పెంపకం, వ్యాపారం కొత్త దిశలో సాగుతోంది. సంప్రదాయంగా రహస్యంగా, పరిమిత ప్రాంతాల్లోనే జరిగే ఈ వ్యాపారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మారుతోంది. ముఖ్యంగా కోడి పందెల కోసం ఉపయోగించే కోళ్ల విక్రయాన్ని పెంచేందుకు పెంపకందారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నారు.

అమ్మకానికి సంక్రాంతి పందెం కోళ్లు.. సోషల్ మీడియాను ఇలా కూడా వాడేస్తున్నారా..?
Cocks Fight
Vijay Saatha
| Edited By: |

Updated on: Dec 18, 2025 | 4:58 PM

Share

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ కోళ్ల పెంపకం, వ్యాపారం కొత్త దిశలో సాగుతోంది. సంప్రదాయంగా రహస్యంగా, పరిమిత ప్రాంతాల్లోనే జరిగే ఈ వ్యాపారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మారుతోంది. ముఖ్యంగా కోడి పందెల కోసం ఉపయోగించే కోళ్ల విక్రయాన్ని పెంచేందుకు పెంపకందారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నారు.

ఇంతకుముందు ఏలూరు జిల్లా నూజివీడు, పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటల్లో ఏర్పాటు చేసిన షెడ్లలోనే కోళ్ల విక్రయాలు జరిగేవి. మధ్యవర్తుల ద్వారా కొనుగోలుదారులు అక్కడికి వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా లావాదేవీలు పూర్తి చేసేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పెంపకదారులు నేరుగా కొనుగోలుదారులను చేరుకుంటున్నారు.

సోషల్ మీడియాలో కోళ్ల శిక్షణ, వాటి బలం, వేగం, పోరాట సామర్థ్యాన్ని చూపించే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా వీటిని విక్రయించేందుకు కొన్ని పేజీలు తెరిచి, సినిమాటిక్ స్టైల్లో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. దీని వల్ల కోళ్ల బ్రిడింగ్‌పై కొత్తగా ఆసక్తి పెరుగుతోందని పెంపకందారులు చెబుతున్నారు. ఫలితంగా శిక్షణ పొందిన కోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది.

కొంతమంది పెంపకందారులు ఆన్‌లైన్ బుకింగ్స్ స్వీకరించి, కోళ్లను ఇంటి వద్దకే డెలివరీ చేసే విధానాన్ని కూడా ప్రారంభించారు. గతంలో తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ఓ కోడి పందెంలో సంక్రాంతి 2025 కోసం ఒక కోటి రూపాయల వరకు పందెం జరిగినట్లు ప్రచారం జరగడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే కోళ్ల వ్యాపారం ఇప్పుడు సంప్రదాయ పరిమితులను దాటి డిజిటల్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో ఈ కోళ్ల సందడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..