House Storage Ideas: ఇల్లు ఇరుకుగా ఉందా.. ఈ బెస్ట్ స్టోరేజ్ టిప్స్ మీకోసమే!
ఇల్లు చిన్నదైనా.. పెద్దదైనా పర్వాలేదు.. సొంత ఇల్లు ఉంటే చాలు అనేకునే వారు చాలా మంది ఉంటారు. ఆ చిన్న ఇల్లు కోసమే ఎన్నో కష్టాలను అనుభవించి.. చివరికి సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటారు. అయితే ఇక్కడే చిన్న చిన్న చిక్కుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఎక్కువ ప్లేస్ ఉండే వారు స్టోరేజ్ ఎంత కావాలనుకుంటే అంత సౌకర్యంగా ఏర్పాటు చేసుకుంటారు. కానీ చిన్న ఇళ్లకు వచ్చేసరికి స్టోరేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీంతో చిన్న ఇళ్లు కట్టుకునేటప్పుడే..

ఇల్లు చిన్నదైనా.. పెద్దదైనా పర్వాలేదు.. సొంత ఇల్లు ఉంటే చాలు అనేకునే వారు చాలా మంది ఉంటారు. ఆ చిన్న ఇల్లు కోసమే ఎన్నో కష్టాలను అనుభవించి.. చివరికి సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటారు. అయితే ఇక్కడే చిన్న చిన్న చిక్కుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఎక్కువ ప్లేస్ ఉండే వారు స్టోరేజ్ ఎంత కావాలనుకుంటే అంత సౌకర్యంగా ఏర్పాటు చేసుకుంటారు. కానీ చిన్న ఇళ్లకు వచ్చేసరికి స్టోరేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీంతో చిన్న ఇళ్లు కట్టుకునేటప్పుడే కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే.. మీకు ఈ సమస్య ఉండదు. ఇలాంటి వారికి సూపర్ స్టోరేజ్ ఐడియాలను ఇంటీరియర్ డిజైనర్లు సూచిస్తూ ఉంటారు. అవేంటో ఒక్కాసారి లుక్కేసేయండి. ఇవి మీకు కూడా హెల్ప్ చేస్తాయో చూడండి.
మెట్లలో స్టోరేజ్..
చాలా మంది ఇంట్లోనే మెట్లను పెట్టుకుంటూ ఉంటారు. అలా చిన్న ఇంట్లో స్టోరేజ్ ఎక్కువగా కావాలి అనుకునేవారు మెట్ల కింద కబోర్డు వచ్చేలా ఏర్పాటు చసుకోండి. ఇలా ఎన్ని మెట్లు ఉంటే అన్ని సొరుగులు వస్తాయి. వీటిల్లో చిన్న చిన్న సామాన్లు పట్టేస్తాయి.
కార్నర్ ర్యాక్ లను ఏర్పాటు చేయండి..
ఒక్కోసారి ఇంటి మూలల్లో కార్నర్స్ లో ఎక్కువ ప్లేస్ మిగులుతూ ఉంటుంది. ఇలాంటి వారు.. ప్లాస్టిక్ లేదా చెక్కతో తయారైన కార్నర్ ర్యాక్ లను ఏర్పాటు చేసుకోండి. వీటి వల్ల ప్లేస్ అనేది కవర్ అవుతుంది. అంతే కాకుండా కిటికీల దగ్గర కూడా కొంత ప్లేస్ ఉంటుంది. దీన్ని రీడింగ్ స్పేస్ లాగా ఉపయోగించు కోవచ్చు.
కూర్చునే వాటిని స్టోరేజ్ లా ఉపయోగించు కోవచ్చు..
ఇరుకు ఇల్లు ఉండే వారికి అటూ ఇటూ తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు హాల్, డైనింగ్ హాల్ వద్ద కుర్చీలను వాడుతూ ఉంటారు. అయితే అవి కేవలం కూర్చోవడానికి మాత్రమే కాకుండా.. స్టూల్స్ కింద స్టోరేజ్ ఉండేలా చూసుకోండి. డైనింగ్ టేబుల్ కింద కూడా.. ఏమైనా పెట్టుకునే విధంగా ఏర్పాటు చేయండి.
షెల్పులు పైన ఉండేలా ఏర్పాటు చేసుకోండి..
షెల్పులు అనేవి చాలా మంది కింద నుంచే పెట్టకుంటారు. అలా కాకుండా మనిషి ఎత్తు కంటే పైన ఉండేలా చూసుకోండి. అంటే ఇంటి హైట్ గా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే ఇరుకుగా ఉండదు. అలాగే ఇప్పుడు గోడలకు తగిలించుకునే పెగ్ బోర్డులు వస్తున్నాయి. వాటిని కూడా మన అవసరాలకు తగ్గొట్టు.. మనకు కావాల్సి ప్లేస్ లో ఏర్పాటు చేసుకోవచ్చు.