OTT Movie: ఏం సినిమా రా అయ్యా.. ఊహించని ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే నరాలు కట్టే..
ప్రస్తుతం థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలు నెలరోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. హారర్, మిస్టరీ థ్రిల్లర్ చిత్రాల నుంచి రొమాంటిక్ చిత్రాల వరకు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ పామ్‌లో మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీలో అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటున్నారా.. ? అయితే ఇది మీ కోసమే.

ప్రతి క్షణం ఊహించని ట్విస్టులు.. ఆద్యంతం ఊపిరి బిగపట్టే టెన్షన్ సీన్స్‌తో దాదాపు మూడు గంటలపాటు ఆసక్తిని కలిగించే సినిమాను చూడాలనుకుంటున్నారా..? ప్రస్తుతం ఓటీటీలో హారర్, మిస్టరీ థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్, వెబ్ సిరీస్ ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్లుగా ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ గురించి తెలుస.. ? అదే సైలెన్స్ : కెన్ యూ హియర్ ఇట్ ? (Silence: Can You Hear It?). దాదాపు 2 గంటల 16 నిమిషాల పాటు మీకు ఆద్యంతం థ్రిల్లింగ్ కలిగిస్తూ.. మిమ్మల్ని సీట్లకు అతుక్కుపోయేలా చేసే సినిమా ఇది. ఇక క్లైమాక్స్ చూస్తే మీ మతిపోతుంది.
బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్ పేయిన ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ప్రాచీ దేశాయ్, అర్జున్ మాథుర్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఒక్కరూ తమ క్యారెక్టర్లకు ప్రాణం పోశారు.ఈ చిత్రానికి డైరెక్టర్ అబాన్ భరుచా డియోహన్స్ దర్శకత్వం వహించారు. డైరెక్షన్, స్టోరీటెల్లింగ్ విధానంతో ఈ చిత్రాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కించారు. కథనం నెమ్మదిగా సాగుతూ చివరి క్షణం వరకు ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది. ఎప్పటికప్పుడు షాకింగ్ మలుపులతో జనాలను కట్టిపడేస్తుంది. చివరి వరకు చాలా గ్రిప్పింగ్ గా నడిపిస్తుంది.
కథ విషయానికి వ్సతే.. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఊహించని మలుపులతో సాగే ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ ఒక హత్య కేసును టేకప్ చేయడం.. ఒక అమ్మాయి ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో రాత్రి ఉండి.. తెల్లారేసరికి శవమై కనిపిస్తుంది. ఆమె హత్యకు సంబంధించి స్పష్టమైన సాక్షులు, ఆధారాలు ఉండవు. నిజాన్ని రాబట్టడానికి ఆ పోలీస్ ఆఫీసర్ కు కేవలం 7 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. దీంతో అతడు ఏం చేశాడు.. ? ఎలా ఈ కేసును సాల్వ్ చేశాడనేది సినిమా స్టోరీ. 2024లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..