Health Tips: గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా.? వైద్యులు ఏం చెబుతున్నారంటే

అమ్మతనం ప్రతీ స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. గర్భంతో ఉన్నప్పుడు ఆమెను.. తన భర్త చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో ఆమె శరీరంలో పిండం ఎదుగుదలకు అనుగుణంగా మార్పులు జరుగుతాయి. ఇదిలా ఉంటే..

Health Tips: గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా.? వైద్యులు ఏం చెబుతున్నారంటే
Lifestyle
Follow us

|

Updated on: Jul 24, 2024 | 12:47 PM

అమ్మతనం ప్రతీ స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. గర్భంతో ఉన్నప్పుడు ఆమెను.. తన భర్త చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో ఆమె శరీరంలో పిండం ఎదుగుదలకు అనుగుణంగా మార్పులు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా.? ఏది సరైన సమయం.? అనే డౌట్ పలువురికి ఉంటుంది. మరి దానికి వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: SRHలో లేఆఫ్స్ మొదలు.. ఆ బౌలర్‌పైనే తొలి వేటు వేయనున్న కావ్య మారన్.. ఎవరో తెల్సా

వైద్యుల అభిప్రాయం ప్రకారం, మీరు గర్భం దాల్చిన తర్వాత కూడా శృంగారంలో పాల్గొనవచ్చు. 9 నెలల్లో మీరు ఎప్పుడైనా మీ భాగస్వామితో చేయవచ్చు. కానీ భంగిమల విషయంలో తల్లి, బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలంటున్నారు. అయితే గర్భస్రావం లేదా కడుపు సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం.. గర్భధారణ సమయంలో సంభోగానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గర్భిణీ స్త్రీ తన మొదటి 16 వారాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని.. ఆ సమయంలో ఎలాంటి లైంగిక చర్యలోనూ పాల్గొనకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. భాగస్వామితో శృంగారంలో పాల్గొనాలని అనుకుంటే.. అది కూడా 16 వారాల తర్వాతే మంచిదని తెలిపారు. అంతేకాదు గర్భిణీ స్త్రీ ఆరోగ్యంపై సంబంధిత డాక్టర్‌ను సంప్రదించి.. సంభోగంలో పాల్గొనాలని చెప్పారు.

ఇది చదవండి: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే

గర్భంలో ఏవైనా సమస్యలుంటే, గర్భిణీ స్త్రీ, శిశువు ఆరోగ్యం నిమిత్తం శృంగారంలో పాల్గొనకపోవడం మంచిది. గర్భిణీ స్త్రీకి గర్భాశయ సమస్య ఉన్నట్లయితే లేదా బిడ్డ నెలలు నిండకుండానే పుట్టడం లాంటి సమస్యలు గతంలోనే ఎదుర్కుని.. మీరు మళ్లీ గర్భం దాల్చినట్లయితే శృంగారంలో పాల్గొనవద్దు. ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో శృంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. గర్భధారణ సమయంలో శృంగారం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది, బిడ్డ, తల్లి ఇద్దరికీ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. ముందుగా ఆరోగ్య సమస్యలు లేకుంటే, శృంగారంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రెగ్నెన్సీ తర్వాత శృంగారంలో పాల్గొనే ముందు వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.

ఇది చదవండి: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి