Healthy Methi Rice: మేతి రైస్ ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..
ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. వీటిల్లో శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. నాన్ వెజ్ తినని వాళ్లు.. ఆకు కూరలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలాంటి ఆకు కూరల్లో మెంతి కూర కూడా ఒకటి. మెంతి కూరలో ఎన్నో రకాల పోషకాలు నిండి ఉంటాయి. మెంతి కూరను ఎలాంటి వెజిటేబుల్స్‌తో కలిపి వండినా చాలా రుచిగా ఉంటాయి. మెంతి కూర తినని వాళ్లు రుచిగా..

ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. వీటిల్లో శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. నాన్ వెజ్ తినని వాళ్లు.. ఆకు కూరలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలాంటి ఆకు కూరల్లో మెంతి కూర కూడా ఒకటి. మెంతి కూరలో ఎన్నో రకాల పోషకాలు నిండి ఉంటాయి. మెంతి కూరను ఎలాంటి వెజిటేబుల్స్‌తో కలిపి వండినా చాలా రుచిగా ఉంటాయి. మెంతి కూర తినని వాళ్లు రుచిగా, హెల్దీగా ఇలా మెంతి రైస్ చేసుకోండి. ఈ రైస్ లంచ్, డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు. మరి ఈ మెంతి కూర రైస్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మెంతి కూర రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
మెంతి కూర, వండిన రైస్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పుదీనా, కొత్తి మీర, ఇంగువ, ఆలు గడ్డలు, బఠానీలు, పసుపు, ఉప్పు, కొబ్బరి తురుము, నెయ్యి లేదా నూనె, టమాటాలు
మెంతి కూర రైస్ తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో ఆయిల్ లేదా నెయ్యి వేయండి. ఇది వేడెక్కాక.. ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. ఇవి వేగాక కరివేపాకు, పుదీనా పచ్చి మిర్చి కూడా వేసి వేగాక.. ఉడికించిన ఆలు గడ్డలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ నెక్ట్స్, పచ్చి బఠానీలు వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాక… టమాటా ముక్కలు వేసి వేయించాలి. ఇవి కూడా వేగాక మెంతి ఆకులు వేసి ఫ్రై చేయాలి. ఇవి కాసేపు వేగాక కొబ్బరి తురము, పసుప వేసి, కొత్తి మీర వేసి మరి కాసేపు వేయించాలి.
ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేశాక.. ఒక సారి కలిపి ఉడికించిన అన్నాన్ని వేయాలి. ఈ రైస్ ని బాగా వేయించాక.. కొత్తి మీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మేతి రైస్ సిద్ధం. ఈ రైస్‌ని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లోకి తీసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అంతే కాదు రైస్ తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.