Lauki Soup Recipe: ఈ సీజన్‌లో త్వరగా జీర్ణం అయ్యే వేడివేడి సొరకాయ సూప్‌ని తాగండి.. రెసిపీ మీ కోసం

వర్షాకాలంలో రాత్రి సమయంలో ఆహారం బదులుగా వేడి వేడి సూప్ ని తీసుకోవడం వలన కడుపు శుభ్రం అవుతుంది. సూప్ ని తాగడం వలన కడుపు నిండుగా ఉండడమే కాదు.. ఎక్కువ సేపు హైడ్రేటెడ్ గా ఉంటుంది. అందుకనే చాలా మంది కూరగాయలతో రకరకాల సూప్స్ ని ఇష్టపడతారు. అలాంటి సూప్స్ లో ఒకటి సొరకాయ సూప్. ఆనపకాయ త్వరగా జీర్ణం అవుతుంది. క్యాలేరీలు తక్కువగా ఉండడంతో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి మంచి ఫుడ్ సొరకాయ. ఈ రోజు త్వరగా జీర్ణం అవ్వడమే కాదు రోగనిరోధక శక్తిని పెంచే సొరకాయ సూప్ రెసిపీ గురించి తెలుసుకుందాం..

Lauki Soup Recipe: ఈ సీజన్‌లో త్వరగా జీర్ణం అయ్యే వేడివేడి సొరకాయ సూప్‌ని తాగండి.. రెసిపీ మీ కోసం
Lauki Soup Recipe
Follow us
Surya Kala

|

Updated on: Jul 24, 2024 | 8:23 PM

వర్షాకాలం వస్తే చాలు ఒకొక్కసారి భోజనం చేయాలని అనిపించదు. ఏదైనా వేడి వేడి పకోడీలు, మొక్క జొన్న పొత్తులు, బజ్జీలు వంటి ఆహారాన్ని తినాలని కొంతమంది కోరుకుంటారు. అదే సమయంలో కొంతమంది వేడి వేడి సూప్ ని తాగాలని కోరుకుంటారు. వర్షాకాలంలో రాత్రి సమయంలో ఆహారం బదులుగా వేడి వేడి సూప్ ని తీసుకోవడం వలన కడుపు శుభ్రం అవుతుంది. సూప్ ని తాగడం వలన కడుపు నిండుగా ఉండడమే కాదు.. ఎక్కువ సేపు హైడ్రేటెడ్ గా ఉంటుంది. అందుకనే చాలా మంది కూరగాయలతో రకరకాల సూప్స్ ని ఇష్టపడతారు. అలాంటి సూప్స్ లో ఒకటి సొరకాయ సూప్. ఆనపకాయ త్వరగా జీర్ణం అవుతుంది. క్యాలేరీలు తక్కువగా ఉండడంతో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి మంచి ఫుడ్ సొరకాయ. ఈ రోజు త్వరగా జీర్ణం అవ్వడమే కాదు రోగనిరోధక శక్తిని పెంచే సొరకాయ సూప్ రెసిపీ గురించి తెలుసుకుందాం..

సొరకాయ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

  1. సొరకాయ- మీడియం సైజ్
  2. ఉల్లిపాయ – ఒకటి
  3. టమాటాలు- రెండు
  4. అల్లం – చిన్న ముక్క
  5. ఇవి కూడా చదవండి
  6. వెల్లుల్లి పేస్ట్ – కొంచెం
  7. పసుపు – చిటికెడు
  8. నిమ్మరసం – ఒక స్పూన్
  9. మిరియాల పొడి- కొద్దిగా
  10. ఉప్పు- రుచికి సరిపడా
  11. కారం – కొంచెం
  12. కొత్తిమీర – కట్ చేసిన

తయారీ విధానం: ముందుగా సోరకాయను శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయను, టమాటాలను కట్ చేసుకుని ఒక్క పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ తీసుకుని అందులో కట్ చేసిన సొరకాయ, టమాటా, ఉల్లిపాయ ముక్కలను వేసి అందులో పసుపు, కారం, ఉప్పు వేసి రెండు కప్పుల నీరు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఉడికించిన కూరగాయ ముక్కలను చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఆ ముక్కలను మిక్సి పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని కుక్కర్ లో ఉన్న కూరగాయలు ఉడికించిన నీళ్లను వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ నీటిలో మిక్సీ పట్టుకున్న కూరగాయల మిశ్రమం, అల్లం ముక్కలను, వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రెండు నిమిషాల పాటు బాగా ఉడికించాలి. తర్వాత అందులో మిరియాల పొడి, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత నిమ్మరసం వేసుకుంటే సొరకాయ సూప్ రెడీ.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు