Millet Pizza: ఇకపై పిజ్జాలు తినేయవచ్చు.. ‘మిల్లెట్ పిజ్జా’ స్పెషల్‌గా మీ కోసం!

పిజ్జాలు అంటే ఇప్పటి యూత్‌కి బాగా ఇష్టం. పిల్లలు కూడా ఇష్టపడి మరీ తింటారు. ఇందులో ఎన్నో రకాలు ఉంటాయి. నాన్ వెజ్, వెజ్ పిజ్జాలను ఎన్నో రకాల టాపింగ్స్‌తో తయారు చేస్తూ ఉంటారు. అయితే వీటిని ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కానీ పిజ్జాలను చూస్తే నోరు ఊరుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు చేసుకుంటే.. ఇకపై తినవచ్చు. అందుకే మీ కోసం..

Millet Pizza: ఇకపై పిజ్జాలు తినేయవచ్చు.. 'మిల్లెట్ పిజ్జా' స్పెషల్‌గా మీ కోసం!
Millets Pizza
Follow us
Chinni Enni

|

Updated on: Jul 24, 2024 | 3:36 PM

పిజ్జాలు అంటే ఇప్పటి యూత్‌కి బాగా ఇష్టం. పిల్లలు కూడా ఇష్టపడి మరీ తింటారు. ఇందులో ఎన్నో రకాలు ఉంటాయి. నాన్ వెజ్, వెజ్ పిజ్జాలను ఎన్నో రకాల టాపింగ్స్‌తో తయారు చేస్తూ ఉంటారు. అయితే వీటిని ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కానీ పిజ్జాలను చూస్తే నోరు ఊరుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు చేసుకుంటే.. ఇకపై తినవచ్చు. అందుకే మీ కోసం ‘మిల్లెట్ పిజ్జా’ రెసిపీ తీసుకొచ్చాం.  మరి ఈ హెల్దీ మిల్లెట్ పిజ్జాలు ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మిల్లెట్ పిజ్జాకు కావాల్సిన పదార్థాలు:

పిండి కలపడానికి: మిల్లెట్స్ పిండి, ఉప్పు, చ్కెర, ఆలివ్ ఆయిల్, గోరు వెచ్చని నీరు.

సాస్ కోసం కావాల్సినవి: ఆలివ్ ఆయిల్, చిన్న ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, వెల్లుల్లి ముక్కలు, టమాటా సాస్, ఉప్పు, ఆరెగానో నల్ల మరియాలు పొడి.

ఇవి కూడా చదవండి

టాపింగ్స్ కోసం: మొజెరెల్లా చీజ్, మీకు ఇష్టమైనవి (నాన్ వెజ్ ఆర్ వెజ్).

మిల్లెట్ పిజ్జా తయారీ విధానం:

ముందుగా పిండిని కలపాలి. ఒక గిన్నె తీసుకుని అందులో మిల్లెట్స్ పిండి, ఉప్పు, పంచదార, ఆలివ్ ఆయిల్, గోరు వెచ్చని నీళ్లు వేస్తూ కలపాలి. ఈ పిండి ఓ పది నిమిషాల పాటు బాగా కలపాలి. ఉండలా చేసుకుని దానిపై మూత పెట్టి.. ఓ గంట పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఓవెన్‌ను 230 డిగ్రీల సెల్సియస్ వేడి చేయాలి. కావాలంటే మీరు పిజ్జా సాస్ బయట దొరుకుతుంది. అంది అయినా ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చెప్పే సాస్ అయినా యూజ్ చేయవచ్చు.

సాస్ తయారీ:

ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి వేయించు కోవాలి. ఆ తర్వాత టమాటా సాస్, ఆరెగానో, ఉప్పు, మిరియాలు వేసి పది నిమిషాలు ఉడికించాలి.

ఇప్పుడు ఓవెన్ ట్రై తీసుకుని దానిపై బటర్ పేపర్ ఉంచాలి. దానిపై ముందుగా కలుపుకున్న పిండిని రౌండ్‌గా చేయాలి. దానిపై సాస్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మీకు ఇష్టమైన టాపింగ్స్ వేసి ఓవెన్‌లో హీట్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మిల్లెట్స్ పిజ్జా సిద్ధం. ఈ పిజ్జాను వారంలో ఒకసారి తిన్నా ఎలాంటి నష్టం ఉండదు. పిల్లలకు స్నాక్‌లా ఇవ్వొచ్చు.