Dora Cake: డోరేమాన్‌కి ఇష్టమైన కేక్స్.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసేయండి..
డోరేమాన్ కేక్.. ఇది ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. అదేనండీ పిల్లలకు ఎంతో ఇష్టమైన డోరేమాన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే కార్టూన్సే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇక తప్పదు అన్నట్టు పెద్దలు కూడా పిల్లలతో కలిసి చూస్తూ ఉంటారు. అలా డోరేమాన్, నోబితా కార్టూన్ పిల్లలతో పాటు పెద్దలు కూడా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ కార్టూన్ చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది. ఇందులో డోరేమాన్‌కి ఎంతో ఇష్టమైన కేక్స్ గురించి..
డోరేమాన్ కేక్.. ఇది ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. అదేనండీ పిల్లలకు ఎంతో ఇష్టమైన డోరేమాన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే కార్టూన్సే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇక తప్పదు అన్నట్టు పెద్దలు కూడా పిల్లలతో కలిసి చూస్తూ ఉంటారు. అలా డోరేమాన్, నోబితా కార్టూన్ పిల్లలతో పాటు పెద్దలు కూడా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ కార్టూన్ చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది. ఇందులో డోరేమాన్‌కి ఎంతో ఇష్టమైన కేక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ డోరేమాన్ కేక్స్‌ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కేక్ తయారీకి గుడ్లు, ఓవెన్ కూడా అవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్‌లో తయారు చేసుకోవచ్చు. మరి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
డోరేమాన్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
కప్పు మైదా పిండి, ముప్పావు కప్పు పంచదారను పొడిగా చేసుకోవాలి, కొద్దిగా బేకింగ్ సోడా, ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ బటర్, సగం కప్పు పాలు, ఫిల్లింగ్ కోసం మీకు ఇష్టమైన ఆల్మండ్ లేదా పీనట్ బటర్ ఇలా ఏదైనా బటర్ తీసుకోవచ్చు.
డోరా కేక్ తయారీ విధానం:
ముందుగా ఒక వెడల్పుగా, లోతుగా ఉన్న పాత్ర తీసుకోవలె. ఇందులో మైదాను జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పంచదార పొడిని కూడా జల్లించి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కండెన్స్డ్ మిల్క్, తేనె, వెనీలా ఎసెన్స్, పాలు, బేకింగ్ సోడా, బటర్ వేసి బాగా కలుపుకోవాలి. విస్కర్ ఉంటే ఈజీగా కలుపుకోవచ్చు. ఇప్పుడు కేక్ తయారు చేయడానికి ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకోండి. అంతటా బటర్ రాయాలి. ఒక గిరిటెడు పిండి దిబ్బరొట్టెలా వేయండి. ఈ కేకులు లావుగానే ఉండాలి.
ఈ ఈ కేకును చిన్న మంట మీదనే రెండు వైపులా మార్చుకోవాలి. ఇలా అన్నీ కేకులు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కేక్ తీసుకుని ఒక వైపు మీకు ఇష్టమైన ఆల్మండ్ లేదా హాజెల్ నట్, పీనట్ బటర్ రాసి మరో వేపు దీనిపై పెట్టి గట్టిగా అంచులు ప్రెస్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే డోరా కేక్స్ సిద్ధం. వీటిని పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్స్‌లా ఇవ్వొచ్చు. ఎంతో ఇష్ట పడి మరీ తింటారు.