Ghost Wedding: Ghost Wedding: యాక్సిడెంట్‌లో ప్రియుడు మరణం.. ఘోస్ట్‌ను మ్యారేజ్ చేసుకుంటున్న యువతి.. ఎందుకంటే
'దెయ్యంతో వివాహం' అనేది చైనాలో 3,000 సంవత్సరాల నాటి సంప్రదాయం. ఇందులో జీవించి ఉన్న వారు మరణించిన వారిని వివాహం చేసుకుంటారు. ఇలా పెళ్లి చేసుకుంటే మరణించినవారి ఆత్మ శాంతిని పొందుతుందని నమ్ముతారు. సౌత్ చైనా మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం ముగ్గురిని రక్షించినప్పటికీ తన ప్రియుడిని, అతని సోదరిని రక్షించలేకపోయినందుకు యు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
తాను ప్రేమించిన యువకుడు యాక్సిడెంట్ లో మరణిస్తే అతనిని మరచిపోలేని ప్రియురాలు పురాతన సంప్రదాయం ప్రకారం ప్రియుడి ఆత్మను పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. ఇది ఒక తైవాన్ అమ్మాయి కథ. కారు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆ ప్రమాదంలో యు అనే యువతి తన ప్రేమికుడిని రక్షించలేకపోయింది. ప్రేమికుడు మరణించడంతో ఇప్పుడు యూ తన ప్రేమికుడి కుటుంబ బాధ్యతలను స్వీకరించాలని అందుకు తాను ‘ఘోస్ట్ మ్యారేజ్’ చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ పురాతన సంప్రదాయం ప్రకారం ఈ అమ్మాయి తన ప్రేమికుడి దెయ్యాన్ని వివాహం చేసుకుంటుంది. ఆమె జీవితాంతం అతనితోనే ఉంటుంది.
‘దెయ్యంతో వివాహం’ అనేది చైనాలో 3,000 సంవత్సరాల నాటి సంప్రదాయం. ఇందులో జీవించి ఉన్న వారు మరణించిన వారిని వివాహం చేసుకుంటారు. ఇలా పెళ్లి చేసుకుంటే మరణించినవారి ఆత్మ శాంతిని పొందుతుందని నమ్ముతారు. సౌత్ చైనా మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం ముగ్గురిని రక్షించినప్పటికీ తన ప్రియుడిని, అతని సోదరిని రక్షించలేకపోయినందుకు యు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సంఘటనతో కృంగిపోయిన యు ఇప్పుడు తన ప్రేమికుడి పట్ల గౌరవం, అతని తల్లిని చూసుకోవడం కోసం ‘ప్రేతాత్మను వివాహం’ చేసుకోవాలని నిర్ణయించుకుంది.
యు కథ సోషల్ మీడియాలో చాలా మందిని భావోద్వేగానికి గురి చేసింది. తన ప్రేమికుడు పట్ల, అతని కుటుంబం పట్ల అమ్మాయి బాధ్యతను చాలా మంది ప్రశంసించారు. ‘ప్రేత వివాహం’ అనేది మరణించిన వ్యక్తులు చివరి కోరికలు నెరవేరకుండానే తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆధ్యాత్మిక సాంత్వనకు ప్రతి రూపంగా పరిగణించబడుతుంది.
‘ఘోస్ట్ మ్యారేజ్’ అంటే ఏమిటి?
చైనాలో ‘గోస్ట్ మ్యారేజ్’లో మరో రెండు పద్ధతులు ఉన్నాయి. ఒక సంప్రదాయం నిశ్చితార్థం తర్వాత ఏవైనా కారణాల వల్ల మరణించిన జంటకు ఘోస్ట్ మ్యారేజ్ చేస్తారు. మరొకటి జీవించి ఉన్న వారు.. ఒకరికొకరు తెలియని వ్యక్తులు, లేదా మరణం తర్వాత వివాహం చేసుకుంటారు. ఈ ఆచారం ఆసియాలోని అనేక చైనీస్ కమ్యూనిటీలలో ప్రబలంగా ఉంది. ఈ ఏడాది మేలో మలేషియాలో చైనీస్ జంటకు ‘దెయ్యం పెళ్లి’ నిర్వహించిన సంగతి తెలిసిందే.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..