Krishna Temple: ఈ ఆలయంలో కన్నయ్యకు రోజుకి 10సార్లు నైవేద్యం.. భోగ్ ఆలస్యం అయితే సన్నబడతాడు.. ఎక్కడో తెలుసా..

కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువరప్పులో శ్రీ కృష్ణ భగవానుడి ప్రసిద్ధ, అద్భుత ఆలయం ఉంది. దీనిని తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 1,500 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ ఆలయానికి రెండవ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయ తలుపులు 24 గంటలలో 2 నిమిషాలు మాత్రమే మూసివేస్తారు.

Krishna Temple: ఈ ఆలయంలో కన్నయ్యకు రోజుకి 10సార్లు నైవేద్యం.. భోగ్ ఆలస్యం అయితే సన్నబడతాడు.. ఎక్కడో తెలుసా..
Thiruvarppu Krishna Temple
Follow us

|

Updated on: Jul 24, 2024 | 4:44 PM

భారతదేశం ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రం. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా ఛేదించని రహస్య దేవాలయాలు కొన్ని ఉన్నాయి. జగన్నాథ దేవాలయంలో అందించే 56 భోగుల గురించి మీరు తప్పక వినే ఉంటారు. అదే విధంగా మరొక శ్రీ కృష్ణుని ఆలయం నేటికీ సైన్స్ చేధించని రహస్య ఆలయంగా నిలుస్తుంది. ఇక్కడ ఉన్న కన్నయ్యకు భగవంతుడు సమయానికి నైవేద్యం అందిచక పోతే.. శరీరం మారడం ప్రారంభమవుతుంది.

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే

కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువరప్పులో శ్రీ కృష్ణ భగవానుడి ప్రసిద్ధ, అద్భుత ఆలయం ఉంది. దీనిని తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 1,500 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ ఆలయానికి రెండవ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయ తలుపులు 24 గంటలలో 2 నిమిషాలు మాత్రమే మూసివేస్తారు.

నైవేద్య్యం 10 సార్లు సమర్పణ

ఈ ఆలయంలో ఉన్న శ్రీ కృష్ణ భగవానుడు ఆకలిని తట్టుకోలేడని ఈ ఆలయానికి సంబంధించి ఒక నమ్మకం ఉంది. దీని కారణంగా కన్నయ్య ఆకలి తీర్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రోజుకు 10 సార్లు శ్రీ కృష్ణ భగవానుడికి నైవేద్యం సమర్పిస్తారు. నైవేద్యం పెట్టకపోతే కన్నయ్య శరీరం చిక్కి పోతుంది. ప్రసాదం ఇచ్చే ప్రసాదం ప్లేట్‌ నుంచి కొద్దికొద్దిగా మాయమవుతుందని కూడా నమ్ముతారు. శ్రీకృష్ణుడు స్వయంగా తనకు సమర్పించిన నైవేద్యాన్ని తింటాడని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

గ్రహణం సమయంలో తెరచి ఉండే తలుపులు

ఈ ఆలయ తలుపులు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో కూడా మూసివేయరు. ఒకసారి గ్రహణ సమయంలో ఆలయ ద్వారం మూసివేశారని.. అప్పుడు గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ తలుపులు తెరిచినప్పుడు శ్రీ కృష్ణుడి విగ్రహం ఎండిపోయి నడుముకి ఉన్న వడ్డాణం జారిపోయి ఉండడం ప్రజలు చూశారు. ఈ విషయం తెలుసుకున్న ఆదిశంకరాచార్యులు గ్రహణ కాలంలో కూడా ఆలయాన్ని తెరిచి ఉంచాలని సమయానికి దేవుడికి నైవేద్యం సమర్పించాలని చెప్పారు.

పూజారి దగ్గర గొడ్డలి

ఆదిశంకరాచార్యులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ ఆలయం 24 గంటల్లో 2 నిమిషాలు మాత్రమే మూసివేసి ఉంచుతారు. ఈ ఆలయం 11.58 నిమిషాలకు మూసివేస్తారు. 2 నిమిషాల తర్వాత సరిగ్గా 12 గంటలకు తెరుస్తారు. ఆలయ పూజారి వద్ద తాళంతో పాటు గొడ్డలి కూడా ఉంటుంది. ఒకవేళ ఆలయం తాళం తీయడానికి సమయం పడితే గొడ్డలితో తాళం పగలగొట్టాలని అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టడంలో జాప్యం చేయవద్దని పూజారికి సూచించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

నైవేద్యం ఆలస్యమైతే కన్నయ్య సన్నబడతాడు.. ఈ ఆలయం ఎక్కడో తెలుసా
నైవేద్యం ఆలస్యమైతే కన్నయ్య సన్నబడతాడు.. ఈ ఆలయం ఎక్కడో తెలుసా
నిరుద్యోగంపై కేంద్రం సమరం..ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు
నిరుద్యోగంపై కేంద్రం సమరం..ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు
సింగరేణి సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: కిషన్ రెడ్డి
సింగరేణి సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: కిషన్ రెడ్డి
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అమృతా ప్రణయ్! సెంటిమెంట్ వర్క్ఔట్ అయ్యేనా?
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అమృతా ప్రణయ్! సెంటిమెంట్ వర్క్ఔట్ అయ్యేనా?
ఢిల్లీలో ముగిసిన వైఎస్ జగన్ దీక్ష.. ఈ జాతీయ పార్టీ నేతల మద్దతు..
ఢిల్లీలో ముగిసిన వైఎస్ జగన్ దీక్ష.. ఈ జాతీయ పార్టీ నేతల మద్దతు..
ఆస్తి కొనుగోళ్లపై టీడీఎస్ బాదుడు.. కఠిన నిబంధనల అమలు
ఆస్తి కొనుగోళ్లపై టీడీఎస్ బాదుడు.. కఠిన నిబంధనల అమలు
ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.?
ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.?
మారిన నిబంధనలు.. పాత, కొత్త పన్ను విధానాలలో ఏది మంచిది?
మారిన నిబంధనలు.. పాత, కొత్త పన్ను విధానాలలో ఏది మంచిది?
మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలంటే.. ఈ ఫుడ్స్ బెస్ట్..
మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలంటే.. ఈ ఫుడ్స్ బెస్ట్..
శివయ్య ఆరు పేర్లు అత్యంత ప్రత్యేకం ఆ పేర్లు ఏమిటి? అర్ధం ఏమిటంటే
శివయ్య ఆరు పేర్లు అత్యంత ప్రత్యేకం ఆ పేర్లు ఏమిటి? అర్ధం ఏమిటంటే