AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shiva: శివుడికి 108 పేర్లున్నా.. ఆరు పేర్లు అత్యంత ప్రత్యేకం.. ఆ పేర్లు ఏమిటి? అర్ధం ఏమిటో తెలుసా..

పురాణాలలో శివునికి చాలా పేర్లు ఉన్నాయి. ప్రతి పేరుకి ఒక అర్ధం.. ప్రాముఖ్యత ఉంది. ఈ నామాలను రోజూ జపించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. శివుని వివిధ గుణాలు, స్వభావం, మతపరమైన ప్రాముఖ్యత ఈ పేర్ల ద్వారా వెల్లడవుతుంది. హిందూ విశ్వాసం ఆధారంగా శివునికి 108 పేర్లున్నాయి. అయితే ఆరు పేర్లు అత్యంత ప్రియమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈ రోజు శివుడి ఆరు ప్రత్యేక పేర్లు, అ పేర్లకు ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

Lord Shiva: శివుడికి 108 పేర్లున్నా.. ఆరు పేర్లు అత్యంత ప్రత్యేకం.. ఆ పేర్లు ఏమిటి? అర్ధం ఏమిటో తెలుసా..
Lord Shiva
Surya Kala
|

Updated on: Jul 24, 2024 | 4:10 PM

Share

శివయ్య ని చాలా తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు. నిర్మలమైన హృదయంతో పూజిస్తే త్వరగా అనుగ్రహిస్తాడు. భక్తితో, నిర్మలమైన హృదయంతో భోళాశంకరుడికి జలం సమర్పించినా చాలు సంతోషిస్తాడు. భక్తులను ఆశీర్వదిస్తాడు అని నమ్ముతారు. శివుడిని అనేక పేర్లతో పిలుస్తారు. పురాణాలలో శివునికి చాలా పేర్లు ఉన్నాయి. ప్రతి పేరుకి ఒక అర్ధం.. ప్రాముఖ్యత ఉంది. ఈ నామాలను రోజూ జపించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. శివుని వివిధ గుణాలు, స్వభావం, మతపరమైన ప్రాముఖ్యత ఈ పేర్ల ద్వారా వెల్లడవుతుంది. హిందూ విశ్వాసం ఆధారంగా శివునికి 108 పేర్లున్నాయి. అయితే ఆరు పేర్లు అత్యంత ప్రియమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈ రోజు శివుడి ఆరు ప్రత్యేక పేర్లు, అ పేర్లకు ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

భోలానాథుడు శివుడిని “భోలాశంకరుడు” అని కూడా పిలుస్తారు. ఎందుకంటే శివుడు చాలా మృదు స్వభావి.. అత్యంత దయగల దైవం. భోళా అంటే సాధారణ మరియు అమాయకత్వం.. “నాథుడు” అంటే ప్రభువు లేదా దైవం. శివుని భోలేనాథ్ అనే పేరుతో పిలుస్తారు. అంటే నిర్మలమైన హృదయానికి చిహ్నం. శివుడు తన భక్తుల నిర్మలిన భక్తికి, ప్రేమకు సంతోషిస్తాడు. వెంటనే కరుణించి తనని కొలిచిన భక్తులను అనుగ్రహిస్తాడు.

శంకర శివుడిని శంకర అనే పేరుతో కూడా పిలుస్తారు. శంకర అంటే “సంతోషం, సంక్షేమం కలిగించేవాడు” అని అర్థం. ప్రపంచంలోని సమస్త ప్రాణుల క్షేమం కోసం పనిచేస్తుండటం వల్ల శివుడికి శంకరుడు అనే పేరు వచ్చింది. తన భక్తులకు మోక్షాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. శివుడిని శంకర అనే పేరుతో పిలవడం మంగళకరమైన, సంక్షేమ, సృజనాత్మక లక్షణాలను చూపుతుంది.

ఇవి కూడా చదవండి

శివుడు లయకరుడిని “శివ” అనే పేరుతో పిలుస్తారు. ఇది శివయ్యకు అతి ముఖ్యమైన పేరు. “శివ” అంటే “దయగల” లేదా “మంచిది”. ఈ పేరు అతని పూర్తి స్వభావం, లక్షణాలను సూచిస్తుంది. శివుడి విధ్వంసం చేస్తాడు.. పునర్మిస్తాడు. అతను జీవిత చక్రాన్ని సమతుల్యంగా ఉంచుతాడు. సృష్టి ముగింపులో విధ్వంసం తెచ్చి తద్వారా కొత్త సృష్టి ప్రారంభిస్తాడు. తద్వారా సృష్టి నిరంతర చక్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అందుకే “శివ” అని పిలుస్తారు.

మహాదేవుడు శివుడిని “మహాదేవుడు” అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పేరు అతని ఆధిపత్యం, గొప్పతనానికి చిహ్నం. “మహా” అంటే “గొప్ప” ,దేవ్” అంటే “దేవుడు”.కనుక “మహాదేవుడు” అంటే అంటే దేవతలకు దేవుడు. భోలేనాథుడు సకల దేవతలకు దేవుడు. అన్ని యుగాలలోనూ, కాలాలలో పూజించబడతాడు. అతని మహాదేవుడి రూపం అతన్ని ఇతర దేవతల కంటే ఉన్నతంగా నిలబెట్టింది. అతని గొప్ప, దాతృత్వ పనుల కారణంగా అత్యున్నత గౌరవాన్ని పొందాడు. కనుక శివుడి పేరు “మహాదేవుడు” అతని దైవత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

నీలకంఠుడు శివుని మరొక ప్రధాన పేరు “నీలకంఠుడు”, ఎందుకంటే అతను తన గొంతులో సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన గరళాన్ని మించి దాచుకున్నాడు. దాని కారణంగా అతని గొంతు నీలం రంగులోకి మారింది. దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మథనం చేయడం వల్ల అమృతంతో పాటు, విషం కూడా ఉద్భవించింది, ఇది మొత్తం సృష్టిని నాశనం చేయగలదు. సృష్టిని రక్షించడానికి శివుడు ఈ విషాన్ని తాగాడు. ఆ విషాన్ని తన గొంతులో దాచుకున్నాడు. విషం ప్రభావంతో అతని గొంతు నీలంగా మారింది. అప్పటి నుండి అతను “నీలకంఠుడు” అని పిలువబడుతున్నాడు. ఈ పేరు అతని త్యాగం, సృష్టి పట్ల అపారమైన కరుణను ప్రతిబింబిస్తుంది.

మహాకాలుడు శివుడిని “మహా కాలుడు” అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతను కాలానికి ప్రభువు . నాశనం చేసేవాడు. “మహా” అంటే గొప్ప .. “కాలుడు” అంటే సమయం లేదా మరణం. మహాకాళ రూపంలో ఉన్న శివుడు సమయం, మరణం రెండింటినీ నియంత్రిస్తాడు. సృష్టి ముగింపులో అతను విధ్వంసక రూపాన్ని తీసుకుంటాడుని విశ్వాసం. ఉజ్జయినిలో నెలకొని ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అతని మహాకాల రూప ప్రతిష్టకు ప్రధాన కేంద్రం. “మహాకాలుడు” అనే పేరు శివుని అనంతమైన శక్తిని, సృష్టిలో మార్పులలోఅతని పాత్రను ప్రతిబింబిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు